Home /News /national /

DEVOTEES GET FIRST PITCHER OF MARICHI KUNDA FOR 1 30 LAKHS IN ODISHA MUKTESWAR TEMPLE HERE ITS SPECIALITY SK

ఒక్క బిందె నీరు రూ.1.30 లక్షలు.. పోటీపడ్డ భక్తులు.. ఈ ఆలయ గుండం ప్రత్యేకతలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Marichi kunda water Auction: భువనేశ్వర్‌లోని బారాముండా ప్రాంతానికి చెందిన ఓ జంట తొలి బిందెను రూ.1.30 లక్షలకు దక్కించుకుంంది. రెండు బిందె రూ.47 వేలు, మూడో బిందె 13వేలు పలికింది.

    హిందూ ఆలయాల్లో నీటి గుండాలు కనిపిస్తాయి. భక్తులు ఆ గుండాల్లో పుణ్యస్నానాలు ఆచరించి దేవుడిని దర్శించుకుంటారు. కొందరైతే గుండంలోని నీటిని బాటిళ్లలో నింపుకొని ఇళ్లకు తీసుకెళ్తారు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఉచితంగానే ఇస్తారు. కానీ ఆలయ గుండంలోని లక్షల రూపాయలకు విక్రయించడం ఎక్కడైనా చూశారా..! ఒడిశాలోని ముక్తేశ్వర పుణ్యక్షేత్రంలో (Mukteshwar temple) ఒక బిందె నీరు రూ.1.30 లక్షలు పలికింది. ఆ నీటిని తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఇంతకు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి? గుండంలోని నీటికి అంత రేటు ఎందుకు..?

    ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ (Bhubaneswar Lingaraj Temple)లో ముక్తేశ్వర ఆలయం ఉంది. దీనినే లింగరాజు గుడి (Lingaraj Temple)గా పిలుస్తారు. ఈ శివాలయ ప్రాంగణంలో ఓ నీటి గుండం ఉంది. దాని పేరు మరీచి. ఆలయంలో ప్రతి ఏటా లింగరాజస్వామి రుకుణ యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో భాగంగా అశోక అష్టమి ముందురోజు రాత్రి వేళ మరీచి గుండంలో నీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. ఆలయంలో ఉండే బడునియోగ్ వర్గానికి చెందిన సేవకులు ఈ వేలం ప్రక్రియను చేపడతారు. ఆ నీటిని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి కూడా వేలం పాట జరిగింది. వేలం ప్రారంభం ధరను రూ.25వేలకు నిర్ణయించారు. ఐతే భువనేశ్వర్‌లోని బారాముండా ప్రాంతానికి చెందిన ఓ జంట తొలి బిందెను రూ.1.30 లక్షలకు దక్కించుకుంంది. రెండు బిందె రూ.47 వేలు, మూడో బిందె 13వేలు పలికింది. మొదటి మూడు బిందెలు మాత్రమే వేలం వేస్తారు. ఆ తర్వాత మిగిలిన నీటిని పేద దంపతులకు ఉచితంగానే పంపిణీ చేశారు.

    True Friendship: రెండు కాళ్లూ లేవు.. కానీ ఇతడికి ఎప్పుడూ ఆ బాధ లేదు.. నిజమైన స్నేహమంటే ఇది

    ఆ నీటి ప్రత్యేకత ఏంటి?

    మరీచి గుండంలోని నీరు ఎంతో పవిత్రమైనదని స్థానికులు విశ్వసిస్తారు. ఆ నీటితో స్నానంచేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు గుండం చుట్టూ అశోక్ చెట్లున్నాయి. వాటి వేర్ల ప్రభావంతో గుండంలోని నీటికి ఔషధ గుణాలు అన్నాయని చెబుతారు. అందుకే పిల్లలు లేని జంటలు, అనారోగ్య సమస్యలున్న వారు వేలంలో పాల్గొని.. నీటిని దక్కించుకుంటారు. 2019లో జరిగిన వేలంలో బిందెడు నీటిని ఓ జంట రూ.2.50 లక్షలకు కొనుగోలు చేసింది. కరోనా కారణంగా 2020, 2021లో వేలం నిర్వహించలేదు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ వేలం ప్రక్రియ నిర్వహించారు.

    Video Viral: జాతీయజెండాని అలా వాడుకుంటావా..వైరల్‌ వీడియోపై నెటిజన్లు ఫైర్

    మరీచి గుండంలో తొలి బిందెను దకించుకున్న జంట.. ఆ నీటికున్న మహిమ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గుండంలోని నీటితో స్నానం చేస్తే మంచి జరుగుతుందని చెప్పారు. అందుకే ఆ నీటిని కొన్నామని పేర్కొన్నారు. బిందె నీటికి రూ.2.50 లక్షలు పెట్టేందుకైనా తాము సిద్ధపడ్డామని.. కానీ వేలంలో రూ.లక్షా 30వేలకు తమకు బిందెడు నీరు దక్కిందని తెలిపారు. మరీచి గుండంలోని పవిత్ర జలం మొదట తమకే దక్కింనందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. ఈ వేలంపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. భక్తుల్లో ఉన్న మూఢనమ్మకాన్ని క్యాష్ చేసుకుంటూ..గుండంలోని నీటితో వ్యాపారం చేస్తున్నారని హేతువాదులు విమర్శిస్తున్నారు. ఎవరి నమ్మకాలు వారివని మరికొందరు మద్దతు ఇస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Odisha, Trending

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు