ధర్నా చేస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసిన వారికి రాచమర్యాదలు చేశారు. ఎంచక్కా అన్నం, మటన్ కర్రీ వేసి భోజనాలు పెట్టారు. పోలీసులు ఇంత రామమర్యాదలు చేసింది ఎక్కడో కాదు పశ్చిమ బెంగాల్లో. ఇటీవల నార్త్ బెంగాల్లో ఎమ్మెల్యే దేబేంద్రనాద్ రాయ్ మృతి చెందారు. బీజేపీ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. జల్పాయ్గురి జిల్లాలో నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 30 మంది నేతలు, బీజేపీ కార్యకర్తలను వారు కొత్వాలి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ వారికి పోలీస్ స్టేషన్లోనే ఎంచక్కా రాచమర్యాదలు చేశారు. మటన్, భోజనం అందించారు. ఖరీదైన భోజనం సమకూర్చారు. బెంగాల్లో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ కార్యకర్తలకు పోలీసులు ఈ తరహా ట్రీట్ మెంట్ ఇవ్వడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నేతలకు పోలీసుల విందుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అలాగే, ఇన్ చార్జి ఇన్ స్పెక్టర్ బిస్వారాయ్ సర్కార్ను బదిలీ చేశారు.
సహజంగా పోలీస్ స్టేషన్లో ఎలాంటి ట్రీట్ మెంట్ ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ చేసిన వారికి తెలుస్తుంది. కొంచెం పెద్ద లీడర్లు అయితే ఆఫీసులో కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి పంపించేస్తారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలకు ప్యాక్ చేసిన ఫుడ్, మినరల్ వాటర్ బాటిల్స్ కూడా అందించారు పోలీసులు.
Published by:Ashok Kumar Bonepalli
First published:July 16, 2020, 22:13 IST