Home /News /national /

DERA BABA VIDEO MESSAGE GOES VIRAL CONTROVERSIAL TEACHER RELEASED ON PAROLE FROM JAIL IN UP SNR

Viral Video:జైలు నుంచి ఆశ్రమానికి డేరాబాబా .. మళ్లీ శాంతి సందేశం ఇస్తూ వీడియో రిలీజ్

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Viral Video: హత్య, అత్యాచారం కేసులో దోషిగా ఉన్నడేరాబాబా మరోసారి వెలుగులోకి వచ్చారు. పెరోల్‌ బెయిల్‌పై రిలీజైన వివాదాస్పద గురువు..మరోసారి తన శాంతి సందేహాన్ని ఇస్తున్న వీడియోని విడుదల చేశారు. ఇప్పుడు ఆ వీడియోనే వైరల్ అవుతోంది.

అత్యాచారం కేసులో దోషిగా ముద్రపడిన డేరాబాబా(Derababa)అలియాస్ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌(Gurmeet Ram Rahim Singh)మళ్లీ శాంతి సందేహం ఇస్తున్న వీడియో(Video)ఒకటి వైరల్ (Viral) అవుతోంది. ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో జైలుపాలైన డేరా బాబా మళ్లీ వైట్ అండ్ వైట్ డ్రెస్‌ (White and white dress)‌వేసుకొని గొడుగు పట్టుకొని వచ్చి మళ్లీ ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు. భగవంతుడి దయతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాను...నాపై మీకు అందరికి నమ్మకం ఉంటుందని భావిస్తున్నానని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు డేరాబాబా. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని బాగ్‌పత్‌(Baghpat)లోని డేరా సచ్చా సౌద ఆశ్రమం(Dera Sacha Sauda Ashram)నుంచి మాట్లాడుతున్న వీడియోని సోషల్ మీడియా(Social media) ద్వారా విడుదల చేశారు ఆయన మద్దతుదారులు. హర్యానాHaryanaలో తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై డేరా బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈకేసులో ఈ డేరాబాబా దోషిగా నిర్ధారణ కావడంతో ఇంత కాలం డేరాముఖి రోహ్‌తక్‌(Rohtak Jail)జైలులో శిక్ష అనుభవించారు. ఇటీవలే నెల రోజుల పెరోల్‌ బెయిల్‌(Parole Bail)పై బయటకు వచ్చారు.

జైలు నుంచి ఆశ్రమానికి..
ఈ వీడియోలో డేరా బాబా తాను ఏ తప్పు చేయలేదని ప్రజలు గ్రహించాలని..తనపై విశ్వాసం ఉంచాలని కోరారు. ఇదే విషయాన్ని గతంలో కూడా పలు లేఖల ద్వారా ప్రజలకు తన సందేశాన్ని పంపానని ఆ లేఖలు చూసిన వాళ్లంతా చదివారు, విషయం అర్ధం చేసుకున్నారు..కొందరు తనను కలవడానికి ఆశ్రమానికి కూడా వచ్చినట్లు తెలిసిందని చెప్పారు. అయితే ఇప్పుడు గతంలో పెరోల్‌పై వచ్చినప్పుడు చేసిన విధంగా కాకుండా ఈసారి కేవలం ఎవరి ఇళ్లలో వారు ఉంటూ తమ సందేహాన్ని లేఖల ద్వారా తెలుసుకొని పాటించాలని కోర్టు ఆదేశాలను గౌరవించాలని అందరికి తెలిపారు.

డేరా బాబా సందేశం..
డేరా యాజమాన్యం ఆదేశాల మేరకు పనులు జరగాల్సి ఉందని. అలాగే, పరిపాలనతో కలిసి పని చేయాలని వారి ఆదేశాలను పాటించాలని పిలుపునిచ్చారు. 2017లో మహిళలపై అత్యాచారం చేసిన కేసులో శిక్ష పడిన డేరాబాబా అప్పటి నుంచి హర్యానాలోని రోహ్‌తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అత్యాచారంతో పాటు హత్య కేసులు మోపబడ్డాయి. దీంతో డేరా బాబాపై సీబీఐ స్పెషల్ కోర్టు 20ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఓవైపు జైలు శిక్ష అనుభవిస్తూనే అప్పుడప్పుడు పెరోల్ బెయిల్‌పై బయటకు వస్తున్నారు.

ఇది చదవండి: నేడు ప్రధాని మోదీ తల్లి 100వ పుట్టిన రోజు.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న పీఎం


వైరల్ అవుతున్న వీడియో..
గతంలో రెండు వారాల పాటు ఆశ్రమానికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను మినహాయించి ఎవర్ని కలవకూడదని కోర్టు సూచించింది. తన తల్లి హెల్త్ బాగోలేదని సేవ చేసుకోవాలని కోర్టును అభ్యర్ధించడంతో ఈసారి కూడా నెల రోజుల పాటు పెరోల్‌ బెయిల్ మంజూరు చేసింది. తన ఆశ్రమానికి చేరుకున్న 24గంటల్లోనే ఈ వీడియో రిలీజ్ చేశారు. ఎవరూ తొందరపడి తనను కలవాలని అనుకోవద్దని మీ అందరికి తన సత్సంగ్‌ వీడియోలు, లేఖల ద్వారా సందేశాన్ని ఇస్తానంటూ చెప్పుకొచ్చారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Dera baba, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు