హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Dera Baba : డేరా బాబాకు జీవిత ఖైదు.. 20 సంవత్సరాల తర్వాత తేలిన మర్డర్ కేసు.. !

Dera Baba : డేరా బాబాకు జీవిత ఖైదు.. 20 సంవత్సరాల తర్వాత తేలిన మర్డర్ కేసు.. !

Dera Baba : డేరా బాబాకు జీవిత ఖైదు.. 20 సంవత్సరాల తర్వాత తేలిన మర్డర్ కేసు.. !

Dera Baba : డేరా బాబాకు జీవిత ఖైదు.. 20 సంవత్సరాల తర్వాత తేలిన మర్డర్ కేసు.. !

Dera Baba : రంజీత్ సింగ్ హత్యకేసులో దోషిగా తేలిన డేరా బాబాకు పంచకుల సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది.దీంతో పాటు 31 లక్షల రూపాయలను జరిమానగా విధించింది. గత ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతున్న విచారణకు నేటితో ఫుల్‌స్టాప్ పడినట్టైంది.

ఇంకా చదవండి ...

  కాగా డేరా బాబా ( Dera Baba )ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ హత్య ( Murder case ) కేసులో డేరాబాబాతోపాటు మరో నలుగురికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. డేరాబాబాకు జీవిత ఖైదుతోపాటు ( Life Imprisonment ) రూ. 31 లక్షల జరిమానా విధించగా..( fine ) మిగతా నిందితులకు రూ. 50 వేల చొప్పున జరిమానా విధించింది. డేరా సచ్చా సౌదాలోనే రంజిత్ సింగ్ 2002 జులై 10న హత్యకు గురయ్యారు... ఈ హత్య కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డేరా బాబాను దోషిగా నిర్ధారించింది.

  గుర్మీత్ రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగురిని దోషులుగా తేల్చింది. రంజిత్ హత్యకు డేరా బాబా సహా జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్, కృష్ణ లాల్, ఇందర్ సైన్‌లు కుట్ర పన్నినట్టు నిర్ధారించింది. కాగా కుట్రలో కేసులో ఉన్న ఒకరు ఇదివరకే మృత్యువాత పడ్డారు. ఇక జరిమానాలో మృతుడు రంజీత్ సింగ్ కుటుంబానికి కొన్ని డబ్బులు పంపిణి చేయనున్నట్టు చెప్పారు.

   ఇది చదవండి : ఈ కలుపు మొక్కతో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్​ పెట్టొచ్చంట.. ఆ మొక్క ఏంటంటే?


  డేరా బాబా ఆశ్రమంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులను పేర్కొంటూ విడుదలైన ఓ లేఖ అప్పట్లో కలకలం రేపింది. అయితే, అది ఆశ్రమ మేనేజర్‌గా ఉన్న రంజిత్‌ సింగ్‌ రాసినట్లు డేరా బాబా అనుమానించారు. దీంతో ఆయనను హత్య చేసేందుకు డేరా బాబా కుట్రపన్నినట్లు సీబీఐ ఛార్జిషీటు నమోదు చేసింది. ఆ హత్యకేసులో భాగస్తులైన వారిని ఇటీవల దోషులుగా తేల్చి, ఈ రోజు శిక్ష ఖరారు చేసింది. డేరా బాబా ఓ అత్యాచార కేసులో 2017 నుంచి శిక్ష అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే.

  ఇది చదవండి : ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసే ఛాన్స్.. నెలకు రూ.30వేల జీతం


  ఇక కేసుకు సంబంధించి చాలా సంవత్సరాలుగు పెండింగ్‌లో ఉండడంతో ఆ కేసును హర్యాణ ,చంఢిగఢ్ రాష్ట్రాలకు బదీలీ చేయాలని రంజీత్ సింగ్ తండ్రి సీబీఐ కోర్టును కోరాడు. ఆయన కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ ఫైల్ చేశాడు. అయితే సీబీఐ కోర్టు ఎట్టకేలకు డేరా బాబాకు రంజీత్ సింగ్ హత్య కేసులో తీర్పును వెలువరించింది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: CBI, Murder case, National News

  ఉత్తమ కథలు