షార్ట్స్ వేసుకొని ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన అమ్మాయి.. అనుమతించని సిబ్బంది.. చివరకు అలా..

తండ్రితో విద్యార్థిని

పరీక్ష సమయం దగ్గరపడింది.. యువతి తాను పరీక్ష రాయాల్సిన గది వద్దకు చేరుకుంది. అయితే అక్కడి అధికారులు ఆమె పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.

 • Share this:
  పరీక్ష సమయం దగ్గరపడింది.. యువతి తాను పరీక్ష రాయాల్సిన గది వద్దకు చేరుకుంది. అయితే అక్కడి అధికారులు ఆమె పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. షార్ట్స్ వేసుకుని వచ్చినందుకు పరీక్షకు అనుమతించలేమని వారు యువతితో చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కూతురుకు ప్యాంట్ కొనడానికి మార్కెట్‌కు వెళ్లాడు. అయితే పరీక్ష సమయం కావడంతో.. ఆమె అక్కడే ఉన్న ఓ పరదాను చుట్టుకుని పరీక్ష రాసింది. ఈ ఘటన అస్సాంలోని తేజ్‌పూర్ జిల్లాలో(Tezpur district) చోటుచేసుకుంది. గిరిజానంద చౌదరి ఇనిస్టిట్యూట్ ఫార్మాస్యూటికల్ సైన్స్‌లో అగ్రికల్చర్ ఎంట్రన్స్ టెస్ట్(Agricultural Entrance test) రాసేందుకు వచ్చిన యువతికి ఈ పరిస్థితి ఎదురైంది.

  ఈ ఘటనపై ఆ విద్యార్థిని మాట్లాడుతూ.. ‘నేను మా ఊరి నుంచి ఉదయం 10.30 గంటలకు తేజ్‌పూర్ చేరుకున్నాను. బంధువుల ఇంటి వద్ద ఫ్రెష్ అయ్యాను. తర్వాత సమయానికి పరీక్షా కేంద్రానికి(Exam Centre) చేరుకున్నాను. చెకింగ్ తర్వాత నన్ను గేట్ లోనికి అనుమతించారు. ఆ తర్వాత నేను నాకు కేటాయించిన గది వద్దకు వెళ్లాను. ఆధార్ కార్డ్, అడ్మిట్ కార్డ్‌తో సహా పరీక్ష రాసేందుకు అవసరమైన అన్ని పత్రాలు తీసుకెళ్లాను. అయినప్పటికీ వారు నన్ను పక్కకు నిలబడమని చెప్పారు. అందుకు నేను కారణం ఏమిటని అడిగాను. అప్పుడు వారు పొట్టి దుస్తులు ధరించి ఎగ్జామ్ రాసేందుకు అనుమతి లేదని చెప్పారు’అని తెలిపింది.

  Affair: తల్లి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కొడుకు.. తండ్రికి విషయం చెప్పాడు.. అయితే ఇలా జరుగుతుందని ఊహించలేపోయాడు..

  ‘నేను ఈ విషయంపై వారిని ప్రశ్నించాను. షార్ట్స్ ఎందుకు ధరించకూడదని ప్రశ్నించాను. అడ్మిట్ కార్డులో పేర్కొన్న నిబంధనల్లో ఈ విషయం లేదు. అయితే వారు మాత్రం ఇది కామన్ సెన్స్ అని చెప్పారు. అప్పుడు నా నాన్నతో మాట్లాడేందుకు ఓ వ్యక్తి సాయం కోరాను. అతడు అందుకు నిరాకరించాడు. ఆ తర్వాత ప్యాంట్ ఉంటేనే ఎగ్జామ్‌కు అనుమతి ఇస్తారని నేను నాన్నతో చెప్పాను. దీంతో వెంటనే నాన్న ప్యాంట్ తీసుకురావడానికి వెళ్లాడు. అయితే అప్పటికే సమయం దగ్గరపడింది. అప్పుడు అక్కడున్న వారు నాకు ఒక పరద ఇచ్చి దానిని చుట్టుకుని పరీక్ష రాయమని చెప్పారు’అని విద్యార్థిని News18.comతో చెప్పింది.

  ఇక, గురువారం జరిగిన అగ్రికల్చర్ ఎంట్రన్‌ టెస్ట్‌కు గిరిజానంద చౌదరి ఇనిస్టిట్యూట్ ఫార్మాస్యూటికల్(Girijananda Choudhury Institute Pharmaceutical Sciences) పరీక్ష కేంద్రాలలో ఒకటి. అయితే ఈ ఘటనకు సంబంధించి తమ ప్రమేయం లేదని సంస్థ అధికారులు తెలిపారు. పరీక్షను ఏజేన్సీలు నిర్వహించాయని చెప్పుకొచ్చారు.

  Viral Video: ట్రాక్టర్ టైర్ తల మీద నుంచి దూసుకెళ్లింది.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

  ‘నా కూతురు నన్ను పిలిచినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. సమయం తక్కువగా ఉంది. అంత తక్కువ సమయంలో ప్యాంట్ కొందామంటే.. మార్కెట్ చాలా దూరంలో ఉంది. నేను తిరిగి రావడానికి అరగంట పట్టింది. అప్పటికే నా కూతరు కర్టెన్ చుట్టుకుని పరీక్ష రాస్తుంది. కీలకమైన పరీక్షకు కొన్ని నిమిషాల ముందు నా కూతురుని ఒక రకంగా హింసించారు. నా కూతురు ఎగ్జామ్‌లో 200 ప్రశ్నలలో.. 148 ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇంతటి అవమానాన్ని ఎన్నడూ ఎదుర్కొలేదు. పరీక్ష కేంద్రానికి షార్ట్ వేసుకుని రావడంలో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు’అని విద్యార్థిని తండ్రి చెప్పాడు.

  ఈ ఘటపై ఓ ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న అస్సాంకు చెందిన ఉద్దిపోన గోస్వామిఝ(Uddipona Goswami) స్పందిస్తూ.. ‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా మనం ఆజాది కా అమృత్ మహోత్సవాన్ని( Azaadi Ka Amrit Mahotsav) జరుపుకుంటున్నాం. అయితే ఇప్పటికీ మహిళల దుస్తుల పొడవు గురించి మాట్లాడటం బాధకరం. మహిళల వ్యక్తిత్వాలను.. వారి దుస్తుల పొడవు ఆధారంగా నిర్ణయించే వారి పట్ల నేను జాలి పడుతున్నాను. కచ్చితంగా వారి ఆలోచనలు దయానీయంగా ఉన్నాయి.

  Shocking: గత ఏడాది కాలంగా సెక్స్ చేయలేదు.. అయితే డాక్టర్స్ అలా చెప్పేసరికి..

  స్టేట్ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు చాలా మంది మగ విద్యార్థులు చిన్న, సగం నిడివి గల ట్రౌజర్‌లు ధరిస్తారు. అయితే, ఒక మహిళ పరీక్షా కేంద్రానికి సౌకర్యవంతమైన ఏదైనా ధరించాలని భావించినప్పుడు అది సమస్య అవుతుంది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్(Universal Declaration of Human Rights) ఆర్టికల్ 25 ప్రకారం దుస్తులు ధరించే హక్కు కూడా గుర్తించబడింది. ఒక యువతిని వేధించడం భారత రాజ్యాంగంలోని(Indian Constitution) ఆర్టికల్ 14(Article 14) ద్వారా ఇవ్వబడిన మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛను స్పష్టంగా ఉల్లంఘించడమే’అని అన్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: