నోట్ల రద్దు ఓ ఆత్మాహుతి దాడి, దాన్ని మర్చిపోవద్దు: రాహుల్ గాంధీ

పెద్ద నోట్ల రద్దు అనేది తెలివిగా ప్లాన్ చేసి తెలివి తక్కువగా అమలు చేసిన నేరపూరిత ఆర్థిక కుంభకోణం అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

news18-telugu
Updated: November 8, 2018, 10:45 PM IST
నోట్ల రద్దు ఓ ఆత్మాహుతి దాడి, దాన్ని మర్చిపోవద్దు: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ (File)
news18-telugu
Updated: November 8, 2018, 10:45 PM IST
2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దును ఆత్మాహుతి దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. డీమానిటైజేషన్ రెండో వార్షికోత్సవం రోజు ఆయన నోట్ బంద్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని కొన్ని కోట్ల మంది ప్రజలు, చిరు వర్తకుల జీవితాలను ఛిద్రం చేసిందని ఆయన అన్నారు. ‘నవంబర్ 8 అనేది దేశానికి అపకీర్తి తెచ్చిన రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది.’ అని రాహుల్ గాంధీ అన్నారు. ‘రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ నిరంకుశంగా వ్యవహరించి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశం మీద రుద్దారు. ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు మోదీ ప్రకటన చేసిన దానికి, కనీసం ఆయన ఆర్థిక సలహాదారుల ఆమోదం కూడా లేదు. దేశంలో 86శాతం చెలామణిలో ఉన్న కరెన్సీని రద్దు చేసి ఆర్థిక వ్యవస్థ స్తంభించేలా చేశారు. అదో విషాదం.’ అని రాహుల్ గాంధీ తెలిపారు.

భారత్ గతంలో కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. మనం అంటే గిట్టని వాళ్లు, అసూయపడే బయటి వారు మనల్ని గాయంచేయడానికి చూశారు. కానీ, వీటన్నిటికంటే కూడా నోట్ల రద్దు అనేది అత్యంత విషాదకరమైంది. ఎందుకంటే అది మనకు మనమే చేసుకుంది. అదో ఆత్మాహుతి దాడి. దేశంలోని కోట్లాది మంది చిరు వ్యాపారుల జీవితాలను నాశనం చేసింది. అసంఘటిత కార్మికులు నష్టపోయారు. డీమానిటైజేషన్ వల్ల అత్యంత ఇబ్బంది పడింది ఎవరంటే నిరుపేదలే. వారు రోజుల తరబడి బ్యాంకుల ముందు క్యూలో నిలబడాల్సి వచ్చింది. అందులో 120 మంది చనిపోయారు. మనం వారిని మర్చిపోకూడదు.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు


నోట్ల రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయని కేంద్రం చెప్పిందో వాటిలో ఒక్క ప్రయోజనం కూడా ఈ రెండేళ్లలో నెరవేరలేదన్న విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక నిపుణులు చెప్పారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ‘కేంద్రం ఎన్నో చెప్పింది. నకిలీ నోట్లు రావని, ఉగ్రవాదం తగ్గిపోతుందని, నల్లధనాన్ని సమూలంగా నిర్మూలించవచ్చని, సేవింగ్స్ పెరుగుతాయని, డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించవచ్చని తెలిపింది. కానీ అందులో ఒక్కటీ నెరవేరలేదు. ’ అని ఆరోపించారు.అట్టర్ ఫ్లాప్ అయిన నిర్ణయాన్ని కూడా ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ లాంటి వారు సమర్థిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. వారు ఎంతగా అయినా సమర్థించుకోవచ్చని, కానీ ఇది తెలివిగా ప్లాన్ చేసి తెలివి తక్కువగా అమలు చేసిన నేరపూరిత ఆర్థిక కుంభకోణం అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. నోట్ల రద్దు వల్ల ఒక శాతం జీడీపీ పడిపోయిందని, సుమారు 15లక్షల జాబ్స్ పోయాయని రాహుల్ గాంధీ అన్నారు.
First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...