Home /News /national /

DEMOLISH SABARIMALA AND TIRUPATI TEMPLES TOO AT RAVIDAS MANDIR PROTEST DALITS BRISTLE AT DOUBLE STANDARDS SK

Ravidas Temple: తిరుపతి, శబరి ఆలయాలనూ కూల్చండి...దళిత సంఘాల డిమాండ్

న్యూస్18 క్రియేటివ్

న్యూస్18 క్రియేటివ్

తిరుపతి వెంకటేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లిఖార్జున ఆలయం, శబరి అయ్యప్ప ఆలయం, కోయంబత్తూరులోని ఆదియోగి విగ్రహం కూడా అటవీ ప్రాంతాల్లోనే ఉన్నాయని.. మరి వాటిని కూడా కూల్చాలని డిమాండ్ చేశారు.

    సంత్ రవిదాస్ మందిరం కూల్చివేతపై దళిత సమాజం భగ్గుమంది. దేశరాజధానిలో వేలాది మంది దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దేశం నలుమూలల నుంచి ఢిల్లీకి వచ్చి బుధవారం మహాధర్నా చేశారు. నీలం రంగు టోపీలు ధరించి జెండాలు పట్టుకొని అంబేద్కర్‌ భవన్‌ నుంచి రాంలీలా మైదాన్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఐతే తుగ్లకాబాద్‌లో ఆలయాన్ని కూల్చివేసిన ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్లపై ఉన్న వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దాంతో దళిత సంఘాల ఆందోళన హింసాత్మకంగా మారింది.

    500 ఏళ్ల ఉన్న చరిత్ర సంత్ రవిదాస్ మందిరాన్ని తుగ్లకాబాద్ నుంచి తరలించే ప్రసక్తే లేదని దళిత సంఘాలు తేల్చిచెప్పాయి. తమ పోరాటం కూడా అయోధ్య రామమందిరం డిమాండ్ లాంటిదేని స్పష్టంచేశారు. అయోధ్య నుంచి రామమందిరాన్ని తరలించనప్పుడు..తుగ్లకాబాద్ నుంచి రవిదాస్ ఆలయాన్ని ఎందుకు తరలించాలని ప్రశ్నిస్తున్నారు. బుధవారం జరగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ మహాసభ, భీమ్ ఆర్మీ, దళిత బహుజన గ్రూప్ సహా పలు దళిత సంఘాల పాల్గొన్నాయి. హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుంచిపెద్ద మొత్తంలో దళితులు తరలి వెళ్లారు.

    రవిదాస్ మందిరం కూల్చివేత వ్యవహారంలోకి తిరుపతి ఆలయాన్ని కూడా లాగారు ఆందోళనకారులు. అటవీ ప్రాంతంలో ఉందన్న కారణంతో రవిదాస్ మందిరాన్ని కూల్చారని..ఇది ఎంత వరకు సమంజసమని దళిత బహుజన గ్రూప్ ప్రతినిధి బినోయ్ కొరివి ప్రశ్నిస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లిఖార్జున ఆలయం, శబరి అయ్యప్ప ఆలయం, కోయంబత్తూరులోని ఆదియోగి విగ్రహం కూడా అటవీ ప్రాంతాల్లోనే ఉన్నాయని.. మరి వాటిని కూడా కూల్చాలని డిమాండ్ చేశారు.

    రవిదాస్ మందిర్ ఉద్యమం కోసం దళిత సంఘాలు కలిసి అఖిల్ భారతీయ సంత్ శిరోమణి గురు రవిదాస్ మందిర్ సంయుక్త సంరక్షణ్ సమితిగా ఏర్పడ్డాయి. ఐతే తుగ్లకాబాద్‌లో కూల్చిన ప్రాంతంలోనే ఆలయ పునర్మించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నవంబరు 26 వరకు నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించాయి. లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టంచేశాయి. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తుగ్లకాబాద్‌లో ఉన్న సంత్ రవిదాస్ ఆలయాన్ని ఈనెల 10న ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ) అధికారులు కూల్చిన విషయం తెలిసిందే.


    First published:

    Tags: Dalit protest, Delhi, New Delhi, Ravidas Mandir Protest, Sabarimala Temple, Srisailam, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు