హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు -ఇండియా 1947లో పుట్టిందా?

PM Modi: ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు -ఇండియా 1947లో పుట్టిందా?

రాజ్యసభలో మోదీ ప్రసంగం

రాజ్యసభలో మోదీ ప్రసంగం

వరుసగా రెండో రోజూ కాంగ్రెస్ సహా విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ విభజనను ప్రస్తావిస్తూ తెలుగువారి మధ్య కాంగ్రెస్ చిచ్చుపెట్టిందని మండిపడ్డారు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా రెండో రోజూ కాంగ్రెస్ సహా విపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశంలో అసమానతలకు, అడ్డగోలు విభజనలకు, అవినీతి, అక్రమాలు, కరోనా విపత్తు సహా సకల సమస్యలకు కాంగ్రెస్ అనే భూతమే కారణమన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరఫున సమాధానమిస్తూ ప్రధాని మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు. సోమవారం నాటి లోక్ సభ స్పీచ్ తరహాలోనే ఇవాళ కూడా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మోదీ నిప్పులు కురిపించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతర పరిస్థితులనూ ఆయన కీలకకంగా ప్రస్తావించారు.

తెలంగాణను తామే ఏర్పాటు చేశామని కాంగ్రెస్ క్రెడిట్ తీసుకున్నా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించలేదని, ఎన్నికల్లో ఓడగొట్టారని లోక్ సభ ప్రసంగంలో పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఇవాళ రాజ్యసభలో చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పేరును కూడా ప్రస్తావించారు. అధికారం అనే మత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా, తెలంగాణ మధ్య చిచ్చులు పెట్టిందని ప్రధాని ఆరోపించారు.

CM KCRపై దేశద్రోహం కేసు.. PM Modi బాడీ షేమ్, నిర్మలకు అవమానం: BJP సంచలనంరాజకీయ స్వార్థం కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించారాని, కనీసం చర్చ కూడా జరగకుండా విభజన బిల్లును కాంగ్రెస్ ఆమోదించిందని, దాని పర్యవసానాల వల్ల ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు ఇబ్బందలు పడుతున్నాయని మోదీ అన్నారు. తాను తెలంగాణ వ్యతిరేకి కాదన్న మోదీ.. ఏపీ విభజన మాత్రం  సరైన పద్దతిలో జరగలేదన్నారు. తెలంగాణ- ఏపీల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.

Mahie Gill: మెస్మరైజింగ్ బ్యూటీ మహీ గిల్ పొలిటికల్ ఇన్నింగ్స్.. టార్గెట్ కూడా చెప్పేసిందిగా..


బీజేపీ అగ్ర నేత అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి వివాదాలకు తావు లేని రీతిలో, శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఇచ్చామని మోదీ  చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసిందన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సరైన విధంగా విభజన జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు.

Revanth Reddy: ప్రధానివా? గుజరాత్ సీఎంవా? తెలంగాణపై PM Modi వ్యాఖ్యలకు TPCC కౌంటర్ -బీజేపీ అంటే IPC 302అవతలివాళ్లకు అపఖ్యాతి ఆపాదించడం, దేశంలో అస్థిరత నెలకొల్పడం, మంచిని తొలగిండం అనే మూడు విధానాలే కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహాలని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే భారత్ కు ప్రధాన శత్రువన్నారు. కాంగ్రెస్ లేకపోయి ఉంటే దేశంలో ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోత, ఇతర ఘోరాలు జరిగేవే కాదన్నారు.

UP Election BJP Manifesto: రైతులకు ఉచిత కరెంటు -మహిళలకూ భారీ తాయిలాలు: యూపీ బీజేపీ మేనిఫెస్టోఇండియాకు ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తాయిలం కానేకాదని, స్వాతంత్ర్య పోరాటం తర్వాత కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీజీ భావించారని మోదీ గుర్తుచేశారు. అసలు 1947 కంటే ముందు ఇండియానే లేదనే పిచ్చి భ్రమలో కొందరుంటారని, అది నిజం కాదని, దేశం తనంతట తానే నిలబడుతుందని బీజేపీ పాలనలోనే అవగతమైందని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ తన మెమరీని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Parliament, Pm modi

ఉత్తమ కథలు