• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • DELHIS BABA KA DHABA OWNER KANTA PRASAD ATTEMPTED SUICIDE BY CONSUMING SLEEPING PILLS SK

Baba ka Dhaba: ఈ తాత గుర్తున్నాడు కదా.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం

కాంతా ప్రసాద్ దంపతులు (Image:PTI)

ఇటీవల మరో వ్యక్తి కాంతా ప్రసాద్‌పై వీడియో తీశారు. ఆ వీడియో ద్వారా తనకు హెల్ప్ చేసిన గౌరవ్ వాసన్‌కు క్షమాపణలు చెప్పారు కాంతా ప్రసాద్. ఆయన చాలా మంచి వారని.. మోసగాడు కాదని అన్నారు. తాను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని ఆ పెద్దాయన విజ్ఞప్తి చేశారు.

  • Share this:
    ఢిల్లీలో బాబా కా దాబా ఓనర్ గుర్తున్నాడు కదా..? ఓ యూట్యూబ్ వీడియోతో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు. ఐతే ఏ కష్టమొచ్చిందో..ఏమో. ఆ పెద్దాయన ఆత్మహత్యాయత్నం చేశారు. గురువారం రాత్రి ఆల్కాహాల్‌లో నిద్రమాత్రలు కలుపుకొని తాగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబా కా దాబా ఓనర్ కాంతా ప్రసాద్ (81) గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు సఫ్దార్‌జంగ్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రాత్రి 11.15 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి తమకు సమాచారం వచ్చిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మద్యంలో నిద్రమాత్రలు కలుపుకొని తాగి, ఆత్మహత్యకు యత్నించినట్లు కాంతాప్రసాద్ కుమారుడు కరణ్ పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    కాగా, గత ఏడాది కాంతా ప్రసాద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఢిల్లీ మాళవీయనగర్‌లో రోడ్డుపక్కన ఓ చిన్న కొట్టు నడుపుకుంటూ జీవనం సాగించే కాంతా ప్రసాద్.. ఓ యూబ్యూట్ వీడియోతో ఫేమస్ అయ్యారు. గిరాకీ లేక.. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కాంతా ప్రసాద్‌ను గౌరవ్ వాసన్ అనే యూట్యూబర్ వీడియో తీశాడు. కాంతా ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన కష్టాన్ని చూసి ఎంతో మంది చలించిపోయారు. ఆ చిన్న కొట్టుకు వద్దకు భోజనం చేశారు. మరికొందరు ఆర్థిక సాయం చేశారు. కాంతా ప్రసాద్‌కు సాయం చేసేందుకు, గౌరవ్ వాసన్ విరాళాలు సేకరించి ఆయనకు అందజేశారు. ఐతే తన పేరుతో డబ్బులు వసూలు చేసి.. మోసం చేశాడని గౌరవ్ వాసన్‌పై కేసుపెట్టారు కాంతా ప్రసాద్.

    యూట్యూబర్‌పై కేసుపెట్టడంతో కాంతా ప్రసాద్‌పై విమర్శలు వచ్చాయి. నీకు మేలు చేసిన వాడికే కీడు చేస్తావా అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఐతే కాంతా ప్రసాద్‌కు అప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు అందడంతో.. దానితో ఓ హోటల్ కూడా పెట్టారు. కానీ కరోనా సమయంలో గిరాకీ లేక తీవ్రంగా నష్టం వచ్చింది. చివరకు మళ్లీ చిన్నకొట్టు వద్దకే వచ్చి.. వ్యాపారం కొనసాగించారు. అప్పుడు కాంతా ప్రసాద్‌ను చూసి పలువురు నెటిజన్లు సెటైర్లు వేశారు. కర్మ ఎవ్వరినీ వదలిపెట్టదు.. ఎక్కడ మొదలయ్యావో.. మళ్లీ అక్కడికే వచ్చావుగా.. అంటూ విమర్శలు గుప్పించారు.


    ఇటీవల మరో వ్యక్తి కాంతా ప్రసాద్‌పై వీడియో తీశారు. ఆ వీడియో ద్వారా తనకు హెల్ప్ చేసిన గౌరవ్ వాసన్‌కు ఆయన క్షమాపణలు చెప్పారు. ఆయన చాలా మంచి వారని.. మోసగాడు కాదని అన్నారు. తాను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని ఆ పెద్దాయన విజ్ఞప్తి చేశారు.

    తనను ఎవరూ తప్పుగా అర్ధం చేసుకోవద్దని కోరారు. కానీ అంతలోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. కాంతా ప్రసాద్ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చింది? ఆర్థిక సమస్యలా? ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: