Traffic challan: బంపర్ ఆఫర్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు...లక్షన్నర ఈ-చలాన్లు మాఫీ...

నేషనల్ హైవే 24పై అతివేగంగా వెళ్లిన వాహనదారులపై వేసిన 1.5 లక్షల ఇ- చలాన్లను ఉపసంహరించుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: October 15, 2019, 7:15 PM IST
Traffic challan: బంపర్ ఆఫర్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు...లక్షన్నర ఈ-చలాన్లు మాఫీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిత్యం ట్రాఫిక్ చలానాలతో బెంబేలెత్తించే ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు తీపి కబురు అందించారు. గత ఆగస్టు నుంచి అక్టోబర్ 10 వరకు వాహనదారులపై విధించిన సుమారు లక్షన్నర చలాన్లను మాఫీ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ బంపర్ ఆఫర్ కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే పరిమితం. నేషనల్ హైవే 24పై అతివేగంగా వెళ్లిన వాహనదారులపై వేసిన 1.5 లక్షల ఇ- చలాన్లను ఉపసంహరించుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. నేషనల్ హైవే 24 పరిధిలోని నిజాముద్దీన్ బ్రిడ్జి, గాజీపూర్ ప్రాంతాల్లో తిరిగిన వాహనాలకు చలాన్లను వేసినట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. కాగా జాతీయ రహదారి 24పై వేగం పరిమితి గంటకు 70 కిలోమీటర్లు ఉంటే.. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన వాహనదారులకు కూడా చలాన్లు విధించారు. దీంతో భారీ ఎత్తున ఫిర్యాదులు రావడంతో వేసిన చలాన్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...