Smartphones To Students: టీచర్ గొప్ప మనసు.. విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు.. సన్మానించిన ప్రభుత్వం..

(Image Credits: Twitter/@bharti_kalra)

కరోనా తరువాత విద్యాబోధన ఆన్‌లైన్‌కు మారింది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శాపంగా మారింది. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేక ఎందరో విద్యార్థులు చదువులకు దూరమయ్యారు.

  • Share this:
కరోనా తరువాత విద్యాబోధన ఆన్‌లైన్‌కు మారింది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శాపంగా మారింది. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేక ఎందరో విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. ఇలాంటి వారిని విద్యకు చేరువ చేసిన ఒక టీచర్‌ను తాజాగా ఢిల్లీ ప్రభుత్వం(Delhi government) సన్మానించింది. మహమ్మారి సమయంలో పేద విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యను అందించడంలో విశేష కృషి చేసిన భారతి కల్రా(Bharti Kalra) సేవలను ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్‌ అయిన ఈ ఉపాధ్యాయురాలికి ఉత్తమ టీచర్‌గా పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించింది. టీచర్స్ డే రోజున (ఆదివారం) ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం ఆమెను సన్మానించింది.

రోహిణి సెక్టార్ -8 లోని సర్వోదయ విద్యాలయ(Sarvodaya Vidyalaya) వైస్ ప్రిన్సిపాల్ భారతీ కల్రా ఈ అవార్డును స్వీకరించారు. కుటుంబం, స్నేహితుల నుంచి ఆమె 321 స్మార్ట్‌ఫోన్‌లను(smartphones) సేకరించారు. వీటిని పేద విద్యార్థులకు అందజేసి, వారు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేలా ప్రోత్సహించారు. ఈ అవార్డుకు తాను దరఖాస్తు చేయకపోయినా, తనను నామినేట్ చేయడం ఆశ్చర్యంగా ఉందని భారతి చెబుతున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం(Teachers’ Day) రోజున ఈ అవార్డును అందుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ను విద్యార్థులకు చేరువ చేయడం తన కర్తవ్యంగా భావించానని చెప్పారు. తమ పాఠశాలలో చాలా మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు లేనందువల్ల.. వారు ఆన్‌లైన్ తరగతులకు హాజరు కాలేదని ఆమె గుర్తుచేసుకున్నారు.

Billionaire Barber: కోటీశ్వరుడిగా మారిన బార్బర్​.. అతని వద్ద 400 లగ్జరీ కార్లు.. ఇప్పటికీ కూడా..

ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే మా విద్యార్థి ఒకరు కోవిడ్ కారణంగా తండ్రిని కోల్పోయారు. ఆ సమయంలో అతన్ని స్మార్ట్‌ఫోన్ కొని, క్లాసులకు హాజరవ్వాలని అడగలేను. అందువల్ల ఏదో ఒక విధంగా అతడికి ఒక స్మార్ట్‌ఫోన్ ఇచ్చాను. కానీ ఆన్‌లైన్ క్లాసుల(online classes) విషయంలో చాలా మంది పిల్లలు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. మా పాఠశాల ఉపాధ్యాయులందరూ వారి స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లను వాట్సాప్‌లో సంప్రదించడం ప్రారంభించారు. కరోనా వల్ల పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికి చెప్పారు. పాత స్మార్ట్‌ఫోన్లు ఉంటే ఇవ్వాలని కోరారు’ అని ఆమె తెలిపారు.

* మొదట్లో సవాళ్లు
ప్రారంభంలో ప్రజలను ఒప్పించేందుకు కష్టపడ్డామని భారతి చెప్పారు. అయితే క్రమంగా చాలా మంది తమకు తోడుగా నిలిచారని తెలిపారు. ‘ముందు ఈ కార్యక్రమం మూడు, నాలుగు ఫోన్‌లతో ప్రారంభమైంది. మేము ప్రయత్నాలను ఎప్పుడూ ఆపలేదు. అయితే ఇది ఇంత పెద్ద ఉద్యమంలా మారుతుందని నేను ఊహించలేదు. మేము 320కి పైగా స్మార్ట్‌ఫోన్లను సేకరించి పేద విద్యార్థులకు అందించాం’ అని భారతి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కాలేని పిల్లలకు పాఠశాల యాజమాన్యం వర్క్‌షీట్‌లను అందించింది. మహమ్మారి సమయంలో పేద విద్యార్థుల చదువుల కోసం తోటి ఉపాధ్యాయులందరూ నిరంతరం పాటుపడ్డారని భారతి వివరించారు.
Published by:Sumanth Kanukula
First published: