హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఎగ్జిబిషన్ లో ఊహించని ఘటన.. విరిగి పడిన స్వింగ్ రైడ్.. షాకింగ్ వీడియో వైరల్..

ఎగ్జిబిషన్ లో ఊహించని ఘటన.. విరిగి పడిన స్వింగ్ రైడ్.. షాకింగ్ వీడియో వైరల్..

తెగిపడిన ఫెయిల్ స్వింగ్

తెగిపడిన ఫెయిల్ స్వింగ్

Delhi: స్వింగ్ రైడ్ లో ఎగ్జిబిషన్ కు వచ్చిన ప్రజలు కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే స్వింగ్ అక్కడ ఉన్న ఐరన్ రాడ్ నుంచి ఊడిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

మనలో చాలా మంది కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడపడానికి తరచుగా ఎగ్జిబిషన్ లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న జాయింట్ వీల్, రౌండ్ స్వింగ్, హర్స్ రైడింగ్, చెయిర్ గేమ్ మొదలైన వాటిలో ఎక్కడానికి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు ఆసక్తి చూపిస్తుంటారు. ఎగ్జిబిషన్ కు వెళ్లగానే పెద్ద వాళ్లు కూడా పిల్లల్లాగా మారిపోయి.. ఫుల్ జోష్ గా ఎంజాయ్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులలో అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటికే ఎగ్జిబిషన్ లో.. జాయింట్ వీల్ లు ఊడిపోయి కిందపడిపోవడం,లేదా ఏదైన ప్రమాదాలు జరిగిన ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన మరో ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలోని (Delhi) ఘజియాబాద్ లోని రాంలీలా మైదాన్ లో షాకింగ్ ఘటన సంభవించింది. అక్కడ ఉన్న ఎగ్జిబిషన్ లో కొందరు సరదాగా గడపానికి వచ్చారు. వారంతా.. స్వింగ్ రైడ్ ఎక్కికూర్చున్నారు. అది వేగంగా తిరుగుతుంది. అక్కడున్న వారంతా అరుస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో స్వింగ్ ఐరన్ రాడ్ నుంచి ఊడిపోయింది. వెంటనే అది స్పీడ్ గా ఎగిరి బయటవైపుకు వచ్చి పడింది.

అక్కడే ఉన్న నలుగులు వ్యక్తుల గాయపడ్డారు. దీంతో అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. వీరిలో ముగ్గురుపిల్లలు, ఒక మహిళ ఉన్నారు. వెంటనే వీరందరికి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Viral Video

ఉత్తమ కథలు