• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • DELHI SUB INSPECTOR DONATES PLASMA TO PREGNANT WOMAN SAVES TWO LIVES GH SA

Delhi Police: ప్లాస్మా దానం చేసి గర్భిణీ స్త్రీ ప్రాణాలు కాపాడిన ఢిల్లీ పోలీస్!

Delhi Police: ప్లాస్మా దానం చేసి గర్భిణీ స్త్రీ ప్రాణాలు కాపాడిన ఢిల్లీ పోలీస్!

Delhi sub-inspector donates plasma

Delhi Police: ప్లాస్మా దానం చేసి గర్భిణీ స్త్రీ ప్రాణాలు కాపాడిన ఢిల్లీ పోలీస్!

  • Share this:
కరోనా రోగులకు ప్లాస్మా దానం చేసేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన ‘జీవన్​ రక్షక్’​ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. తాజాగా, ఆకాశ్​దీప్​ అనే సబ్ ఇన్‌స్పెక్టర్ తన ప్లాస్మా దానం చేసి గర్భిణీ స్త్రీతో పాటు కడుపులోని బిడ్డ ప్రాణాలను కాపాడాడు. కరోనా పాజిటివ్​గా నిర్థారణ అయిన 27 ఏళ్ల గర్భిణీ స్త్రీ ఢిల్లీ ఉత్తమ్​ నగర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ​ఆ మహిళ ప్రస్తుతం 21 వారాల గర్భవతి. తాను కరోనా నుంచి కోలుకున్న తర్వాత తన రక్తంలో ప్లాస్మా స్థాయి పడిపోయింది. దీంతో, ఆమె ప్లాస్మా సహాయం కోరుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్​ ఢిల్లీ పోలీసు అధికారుల దృష్టికి రావడంతో “జీవన్ రక్షక్” కార్యక్రమంలో భాగంగా ఆమెకు ప్లాస్మా దానం చేశారు.

‘జీవన్ రక్షక్’ బృందం మొదటగా గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులను సంప్రదించి.. ఆ తరువాత, రూప్ నగర్ పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్న ఎస్ఐ ఆకాశ్‌దీప్‌ను కాంటాక్ట్​ చేశారు. ఆకాశ్‌దీప్ వెంటనే తన ప్లాస్మాను దానం చేయడానికి అంగీకరించి మే 10న ఆసుపత్రి వచ్చి ఫ్లాస్మా దానం చేశాడు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు. దీనిపై సదరు మహిళ భర్త మాట్లాడుతూ ‘‘గత రెండు రోజులుగా ప్లాస్మా దాతల కోసం ప్రయత్నించగా.. కొంత మంది దాతలు ముందుకొచ్చారు. అయితే, మెడికల్​ గైడ్​లైన్స్​ ప్రకారం వారి ప్లాస్మాను నా భార్యకు వైద్యులు సిఫార్సు చేయలేదు. దీంతో, మేం ఆశలు కోల్పోయాం. చివరి ప్రయత్నంగా ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేసిన జీవన్​ రక్షల్ పోర్టల్​లో నమోదు చేసుకున్నాం. ఢిల్లీ పోలీసుల చొరవతో ఇప్పుడు నా భార్య, కడుపులోని బిడ్డ ఇద్దరూ క్షేమంగా బయపడ్డారు. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.”అని అన్నారు. కాగా, పోలీసులు తీసుకున్న చొరవతో ఇప్పుడు అంతా వారిని "దిల్ కి పోలీస్" అని పిలుస్తున్నారు.

జీవాన్ రక్షక్ ఎలా పనిచేస్తుంది?
కరోనా రోగుల ప్రాణాలు కాపాడటంలో ప్లాస్మా థెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, చాలా సందర్భాల్లో ప్లాస్మా థెరపీ చేయించుకునే వారు డోనార్ల కోసం వెతకాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యను తీర్చేందకు ఢిల్లీ పోలీసులు ముందుకొచ్చారు. ప్లాస్మా డోనార్ల వివరాలతో కూడిన డిజిటల్ డేటా బ్యాంకును తయారు చేశారు, ఈ మేరకు జీవన్​ రక్షక్​ పేరిట ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​​ను ప్రారంభించారు. ముందుగా, ప్లాస్మా దాతలు, గ్రహీతలు ఇద్దరూ జీవన్​ రక్షక్​ పోర్టల్​లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాస్మా అవసరమైన వారు ఈ పోర్టల్​ ద్వారా దాతను కాంటాక్ట్​ కావడానికి వీలవుతుంది.
First published:

అగ్ర కథనాలు