కొన్ని పాఠశాలలో సదుపాయాలు అరకొరగా ఉంటాయి. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు ఉండవు. చాలా చోట్ల విద్యార్థులు ఇప్పటికి నెలపైన కూర్చుని ఉంటారు. అదే విధంగా.. తాగడానికి నీళ్లు, మరుగుదొడ్లు సదుపాయాలు కూడా సరిగ్గా ఉండవు. వర్షం పడితే చాలు.. రోడ్డుపైన నీళ్లన్ని క్లాస్ లోనికి వచ్చేస్తాయి. మరికొన్ని చోట్ల వర్షం పడగానే క్లాస్ రూమ్ లో కూడా స్లాబ్ లో నుంచి నీళ్లు పడుతుంటాయి. స్లాబ్ లు పెచ్చులూడిపోతున్నాయి. అంతే కాకుండా గోడలు కూలిపోయిన అనేక సంఘటనలు గతంలో వార్తలలో నిలిచాయి. ఇలాంటి సందర్భాలలో కొన్ని చోట్ల విద్యార్థులకు గాయాలు కాగా, మరికొన్ని చోట్ల విద్యార్థులు చనిపోయిన సంఘటనలు కూడా గతంలో జరిగాయి.
పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాంగ్లోయ్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ జరుగుతుంది. ఇంతలో క్లాస్ రూమ్ లోని సీలింగ్ కింద పడింది. దీంతో అక్కడి ఫ్యాన్ ఒక్కసారిగా కింద పడిపోయింది. అప్పుడు కింద క్లాసు వింటున్న విద్యార్థిని పై ఫ్యాన్ పడింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోనికి వెళ్లింది. వెంటనే పాఠశాల సిబ్బంది ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటన ఆగస్టు 27 న జరిగింది.
క్లాస్ లో ఉన్న సీలింగ్ ఇదివరకే వర్షానికి నానిపోయిందని, అందుకు పెచ్చులు ఊడిపోయి కింద పడిందని పాఠశాల సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై విచారణకు సంబంధించి.. ఇప్పటి వరకు పాఠశాల ఉన్నతాధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ విద్యార్థులకు ఏదన్న జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఒక యువతి చేసినపనిని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైకుల్లా స్టేషన్ పరిధిలో.. ఒక యువతి రైల్వే ప్లాట్ ఫామ్ మీద నిల్చోంది. ఆమె దూరం నుంచి లోకల్ ట్రైన్ రావడాన్ని గమనించింది. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి రైలుకు ఎదురుగా వెళ్లి నిలబడింది. ఆమెను ప్లాట్ ఫామ్ మీద ఉన్న వారు... వద్దని పదే పదే వారిస్తున్నారు. అయిన.. పట్టించుకోకుండా రైలుకు ఎదురుగా వెళ్లి నిలబడింది. దీంతో అక్కడున్న వారి అరుపులు విని ఆర్పీఎఫ్ పోలీసు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అదే విధంగా, మరో మోటల్ మ్యాన్ కూడా ఆమెను గమనించాడు.
అతను కూడా ఆమెను కాపాడటానికి వచ్చాడు. ఇద్దరు కలిసి, ఆమెను రైలు ముందు నుంచి పక్కకు తప్పించారు. ఆ తర్వాత వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడిన యువతిని వారు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి యువతిని కాపాడిన ఆర్పీఎఫ్, మోటర్ మ్యాన్ లను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అదే విధంగా వారు చేసిన పనికి హ్యట్సాఫ్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Classes, Delhi, VIRAL NEWS