హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మరింత జోష్ గా భారత్ జోడో యాత్ర.. రంగంలోనికి దిగనున్న సోనియా గాంధీ...

మరింత జోష్ గా భారత్ జోడో యాత్ర.. రంగంలోనికి దిగనున్న సోనియా గాంధీ...

సోనియా గాంధీ (ఫైల్)

సోనియా గాంధీ (ఫైల్)

Delhi:  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ శ్రేణులలో మరింత ఉత్సాహం కన్పిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul gandhi) కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రను (Bharat jodo yatra)  చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళనాడులో తన పాదయాత్రను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కేరళలో పాదయాత్ర ముగించుకుని ఆతర్వాత.. కర్ణాటకలో ప్రస్తుతం యాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో..పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుంది. అనేక మంది ప్రజలు కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. అడుగడుగున ప్రజలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతాలు పలుకుతున్నారు. అనేక మంది ఆయనతో పాటు కొద్ది దూరం వరకు పాదయాత్రలో నడుతుస్తున్నారు.

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అన్నివర్గాల వారుయాత్రలో జోష్ గా పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia gandhi) కూడా భారత్ జోడ్ యాత్రలో పాల్గొననుట్లు సమాచారం. కాగా, సోనియా గాంధీ.. దసరా తర్వాత.. అక్టోబరు 6 పాదయాత్రలో జాయిన్ అవుతున్నట్లు సమాచారం. మరుసటి రోజున ప్రియాంక గాంధీ, వాద్రా కూడా యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పాదయాత్ర ప్రారంభమైనప్పుడు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ మాండ్య జిల్లా నుంచి తొలిసారిగా చేరనున్నారు.

రేపు కర్నాటక చేరుకుని రాహుల్ గాంధీ సారథ్యంలోని యాత్రలో పాల్గొనేందుకు ముందు ఆమె రెండు రోజుల పాటు కూర్గ్‌లో ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన 'భారత్ జోడో యాత్ర' తమిళనాడు , కేరళ తర్వాత శుక్రవారం కర్ణాటకలో ప్రవేశించి 21 రోజుల పాటు 511 కిలోమీటర్ల మేర బీజేపీ పాలిత రాష్ట్రంలో సాగనుంది.

ఇదిలా ఉండగా సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) (Mulayam Singh Yadav) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హర్యానాలోని మేదాంతా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనను టెస్ట్ చేసిన వైద్యులు, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 82 ఏళ్ల సమాజ్ వాది పార్టీ నాయకుడి ఆరోగ్యం ఒక్కసారిగా సీరియస్ కావడంతో వెంటనే ఆయనను ICU కి తరలించారు. కాగా, తండ్రి ఆరోగ్యంపై సమాచారం అందిన వెంటనే అఖిలేష్ యాదవ్ (Akhilesh yadav) లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన నేతాజీ అని ములాయం సింగ్ పేర్కొన్నారు.

అతను ప్రస్తుతం లోక్‌సభలో మెయిన్‌పురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య.. కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే.. ఆయన మొదటి భార్య మాల్తీ దేవి 2003లో మరణించింది. అఖిలేష్ యాదవ్ మాల్తీ దేవికి జన్మించాడు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bharat Jodo Yatra, Congress, Delhi, Sonia Gandhi

ఉత్తమ కథలు