Home /News /national /

DELHI SEX WORKER 19 YEAR OLD SON IS DISTRIBUTING RATION TO SEX WORKERS SU

తమ వాళ్లకు సాయం చేసేందుకు నడుం బిగించిన సెక్స్ వర్కర్ కుమారుడు.. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. అలాంటి వారిలో సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారు.

    కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. అలాంటి వారిలో సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారు. గతేడాది నుంచి కరోనా కారణంగా చాలా మంది సెక్స్ వర్కర్ల పరిస్థితి దయానీయంగా ఉంది. ఇలాంటి వారికి సాయం అందించేందుకు ఓ 19 ఏళ్ల యువకుడు ముందుకు వచ్చాడు. అతని స్నేహితుడితో కలిసి సెక్స్ వర్కర్లకు సాయం చేసేందుకు నిధులు సేకరణ మొదలుపెట్టాడు. అయితే వారిద్దరకు కూడా సెక్స్ వర్కర్ల పిల్లలే. తమ కమ్యూనిటీలో లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని నిత్యావసరాలు అందించడం కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 20న ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో జీబీ రోడ్డులో చాలా మంది సెక్స్ వర్కర్లు తమ గ్రామాలకు తిరిగి వెళ్లడం ప్రారంభించారు. ఇక, ఢిల్లీలోనే ఉండిపోయినవారు వారివద్ద దాచుకున్న డబ్బులతో, సరకులతో తమ అవసరాలను తీర్చుకుంటూ వస్తున్నారు.

    అయితే రోజులు గడస్తున్న కొద్ది వారి వద్ద ఉన్న సరుకులు నిండుకుంటున్నాయి. తమ పిల్లలకు ఆహారం అందజేయడానికి అప్పు చేయాల్సి వస్తుందని కొందరు సెక్స్ వర్కర్లు వాపోయారు. కొందరు తమ ఆరోగ్యం కూడా బాగోలేదని తెలిపారు. ‘పోలీసులు మా ఇంటి డోర్స్‌ను మూసి ఉంచాలని చెప్పారు. తమకు ఆదాయం వచ్చే మార్గం లేదు’అని ఓ సెక్స్ వర్కర్ చెప్పారు.

    అటువంటి పరిస్థితుల్లో ఓ సెక్స్ వర్కర్ కుమారుడు కునాల్(పేరు మార్చడం జరిగింది).. తన సంఘానికి సహాయం చేయడానికి ఓ మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకు తన స్నేహితుడి సాయం తీసుకున్నాడు. అతడు కూడా ఓ సెక్స్ వర్కర్ కుమారుడే. వీరిద్దరు కలిసి ఓ ఎన్జీవోను ఆశ్రయించాడు. బియ్యం, ఇతర నిత్యావసరాలను సేకరించి వారికి పంపిణీ చేయవచ్చని ఆ ఎన్జీవో వారికి సూచించింది. వారి మార్గదర్శకాల ప్రకారం కొందరికైనా సాయం చేయడానికి నిధులు సేకరణ మొదలు పెట్టారు.

    మొదట్లో పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టేందుకు అనుమతించలేదు. అయితే వారి ఆలోచనను అర్ధం చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 800 మంది సెక్స్ వర్కర్స్‌కు రేషన్ కిట్స్ అందజేయాలని ప్రణాళిక వేసుకున్నట్టు కునాల్ చెప్పాడు. ప్రస్తుతం వారి వద్ద 200 మందికి సరిపడ రేషన్ కిట్స్ ఉన్నాయని.. మిగతా వాటిని కూడా సేకరిస్తామని తెలిపాడు. తమ కమ్యూనిటీ ప్రజలకు సాయం చేసేందుక తాము చాలా కమ్యూనిటీ గ్రూపులతో పాటు ఎన్జీవోల సహాయం పొందుతున్నట్టు చెప్పాడు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Coronavirus, Delhi, Lockdown, Sex workers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు