Home /News /national /

Delhi pollution : ప్రమాద స్థాయికి ఢిల్లీ .. పలు ప్రాంతాల్లో కమ్ముకున్న కాలుష్యం..

Delhi pollution : ప్రమాద స్థాయికి ఢిల్లీ .. పలు ప్రాంతాల్లో కమ్ముకున్న కాలుష్యం..

Delhi pollution : ప్రమాద స్థాయికి ఢిల్లీ .. పలు ప్రాంతాల్లో కమ్ముకున్న కాలుష్యం..

Delhi pollution : ప్రమాద స్థాయికి ఢిల్లీ .. పలు ప్రాంతాల్లో కమ్ముకున్న కాలుష్యం..

Delhi pollution : బాంబుల మోతతో ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ప్రమాద స్థాయికి చేరింది. పలు ప్రాంతాల్లో కాలుష్యం అలుముకుంది. పంట పొలాలతో సతమతమవుతున్న ఢిల్లీ .. దీపావళీతో మరింత కాలుష్యానికి గురైంది.

    ప్రమాదస్థాయికి ఢిల్లీ కాలుష్యం..

    ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరింది. నోయిడాలో అత్యధికంగా కాలుష్యం కమ్ముకుంది. ఢిల్లీలోని పూసా రోడ్డులోనూ గాలి నాణ్యత క్షీణించింది. ఢిల్లీలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 314 నుంచి 341 వద్ద ఉంది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో నోయిడాలో ఏక్యూఐ526కు పెరిగింది. ఢిల్లీలో పూసారోడ్డు వద్ద 505 కు చేరింది. ఏక్యూఐ 500 దాటిందంటే తీవ్రమైన కాలుష్యం ఏర్పడిందని తేలింది.పంజాబ్, హర్యానాలో పొలాల మంటల నుంచి వెలువడిన పొగ దేశ రాజధాని వైపు వచ్చింది.

    టపాసుల పై నిర్భంధం..

    మరోవైపు ఢిల్లీలో టపాసుల వ్యతిరేక ప్రచారం చేయడంతోపాటు 13,000 కిలోలకు పైగా అక్రమ పటాకులను స్వాధీనం చేసుకొని, 33 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాపై నిషేధం విధించినప్పటికీ, దీపావళి సందర్భంగా చాలా మంది ప్రజలు వీధుల్లో క్రాకర్లు కాల్చడం కనిపించింది.

    ఇది చదవండి : గుస్సాడి నృత్యాలతో గిరిజన గూడాలు... నెల రొజుల పాటు ప్రత్యేక సందడి..


    దీంతోపాటు వ్యవసాయ పొలాల్లో మంటల నుంచి వెలువడిన పొగ వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. ఢిల్లీ ఆకాశాన్ని పొగమంచు దట్టమైన దుప్పటి కప్పివేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల చాలా మంది ప్రజలు గొంతు, దురద,కళ్ల నుంచి నీరు కారుతున్నట్లు ఫిర్యాదులు చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇలంటి సమస్యలు డిల్లీ సమస్యలు ఎదుర్కొంటున్నారు.. కాని చుట్టు పక్కల రాష్ట్రాల రైతులు వరి పంటల తర్వాత గడ్డిని మొత్తం మంటల్లో వేయడంతో విపరీతమైన కాలుష్యం చోటు చేసుకుంటుంది. అది కూడా చలి కాలం కావడంతో ఈ పరిస్థితి వస్తుంది.

    ఇది చదవండి : కల్తీ మద్యం తాగి 24 మృతి.. ఇలా సంవత్సర కాలంలో 70 మంది ...


    హైదరాబాద్‌లో తగ్గిన కంటి.. ప్రమాదలు..

    మరోవైపు హైదరాబాద్‌లో దీపావళీ ప్రమాదాలు తగ్గినట్టు కనిపిస్తోంది. గతంలో పోలీస్తే.. దీపావళీ బాంబులు కాలుస్తున్న సంధర్భంలో చాలా మంది కళ్లకు ప్రమాదం ఏర్పడింది. కాని నిన్న జరిగిన దీపావళీ ఉత్సవాల్లో అతి తక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు సమాచారం. ఉత్సవాల్లో టపాసులు కాల్చిన వారు పలు రకాల కళ్ల సమస్యలతో సుమారు 30 మంది వరకు చికిత్స కోసం వచ్చినట్టు వైద్యులు తెలిపారు. కాగా ఈ సంఖ్య గత సంవత్సరం అధికంగా ఉందని తెలిపారు.

    ఇది చదవండి : టపాసులు కాల్చడం కాదు.. అక్కడ కొట్టుకోవడమే దీపావళీ స్పెషల్..

    Published by:yveerash yveerash
    First published:

    Tags: Delhi news, Delhi pollution

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు