గాలి నాణ్యతలో మెరుగుదల దృష్ట్యా ఢిల్లీ (Delhi)-ఎన్‌సిఆర్‌లో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై ఆంక్షలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సిఎక్యూఎం) సోమవారం ఎత్తివేసింది. ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశానికి తక్షణమే అనుమతి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలను చేపట్టే ఏజెన్సీలు తప్పనిసరిగా ధూళి నియంత్రణ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దానికి సంబంధించిన గైడ్లైన్స్లన విడుదల చేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని NCR జిల్లాల్లో ఉన్న నిర్మాణ స్థలాల కోసం, 500 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ప్రాజెక్ట్ సైట్లు కలిగిన ఏజెన్సీలు తమ ప్రాజెక్ట్‌లను ఆన్లైన్లో అందుబాటుల ఉంచాలని పేర్కొంది. అన్ని అనుమతులు ఉండేలా పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. నవంబర్ 16న జారీ చేసిన ఉత్తర్వులో, నవంబర్ 21 వరకు ఎన్‌సిఆర్‌లో అన్ని నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేయాలని సిఎక్యూఎం కోరింది.
నవంబర్ 24న ఉత్తర్వులు జారీ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) మళ్లీ నిషేధాన్ని విధించింది. డిసెంబర్ 17న, CAQM ఆసుపత్రులు, హైవేలు మరియు ఫ్లైఓవర్లతో సహా ప్రాజెక్టుల నిర్మాణాలపై మరియు మురుగునీటి శుద్ధి కర్మాగారాల వంటి పారిశుద్ధ్యం, ప్రజా వినియోగ ప్రాజెక్టులపై పరిమితులను సడలించింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరగుతుడడంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఈ అంశంపై ఢిల్లీలో వాయు కాలుష్యంపై సీజేఐ ఎన్వీ రమణ (NV Ramana), డీవై చంద్రచూడ్, సూర్యకాంత్ నేతత్వంలోని ధర్మాసనం విచారణ కూడా జరిపింది. అంతే కాకుండా ఈ ఏడాది నవంబర్‌లో కేవలం వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీలోని స్కూళ్లకు వారం పాటు సెలవులు ఇచ్చారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాలుష్య నియంత్రణ మండలి అంచనా ప్రకారం ప్రకారం పలు సందర్భాల్లో ఢిల్లీని పొగ మంచు కమ్మేయడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 470ని తాకింది. గాలిలో ఈ స్థాయి కాలుష్యం ఉంటే గాలి ఆరోగ్యకరమైన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇక ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని వ్యవసాయ భూముల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల విషపూరితమైన పొగమంచు ఢిల్లీలో వ్యాపిస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
శరవేగంగా సెంట్రల్ విస్టా నిర్మాణం..
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు (Central Vista) పనులు శర వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది స్వతంత్ర దినోత్సవం నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. మొత్తం 64,500 చదరపు మీటర్ల పరిధిలో ఈ నూతన పార్లెమెంట్ (Parliament) భవనాన్ని నిర్మించనున్నారు. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.971 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ భవన నిర్మాణ బాధ్యతలను దిగ్గజ సంస్థ ‘టాటా’ చేపట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Delhi pollution, India