Diwali 2019 : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం... అంతా పొగే...

Delhi Pollution : కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లే జరిగింది. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. వద్దంటే ప్రజలు బాణసంచా బాగా కాల్చారు. ఫలితం అంతా పొగే.

news18-telugu
Updated: October 28, 2019, 6:57 AM IST
Diwali 2019 : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం... అంతా పొగే...
ఢిల్లీలో వాయు కాలుష్యం
  • Share this:
Delhi Pollution : దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెయ్యాలన్నా... ఆ పనుల ప్రభావంతో వాయు కాలుష్యం పెరుగుతుందా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. చివరకు భవన నిర్మాణాలు కూడా సాగనిచ్చే అవకాశాలు లేవు. దీపావళి సందర్భంగా వాయు కాలుష్యం పెరుగుతుందని ముందే అంచనా వేసి... అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా... ఢిల్లీతోపాటూ... చుట్టూ ఉన్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాల్లో బాణసంచా బాగానే కాల్చారు. ఫలితంగా... దట్టమైన పొగలు అంతటా వ్యాపించాయి. ఫలితంగా రోడ్లపై ఏమీ కనిపించట్లేదు. వాహనదారులు గట్టిగా గంటకు 40 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్లాలన్నా ఇబ్బంది పడుతున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో పొల్యూషన్ కేటగిరీ... సివియర్ (తీవ్రం) గా ఉందని తేల్చారు. వాతావరణం వెరీ పూర్ కేటగిరీలో ఉన్నట్లు తెలిపారు. పంజాబ్, హర్యానాలో క్రేకర్లతోపాటూ... ఎండిన పంటల్ని కూడా తగలబెట్టారు. ఫలితంగా పొగ ఎక్కువగా వచ్చింది. ఉత్తి పొగే కాదు... దాన్లో అడ్డమైన రోగాలూ తెచ్చే విష మూలకాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఆ పొగ పీల్చితే ప్రమాదమే. ఊపిరితిత్తులు పాడైపోతాయి. సిగరెట్లు తాగితే ఎంత డేంజరో... ఆ పొగ పీల్చితే కూడా అంతే డేంజరని డాక్టర్లు చెబుతున్నారు.

ఢిల్లీలో 37 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో 29 చోట్ల వాతావరణం పూర్తిగా కలుషితం (వెరీ పూర్ కేటగిరీ) అయినట్లు అధికారులు తెలిపారు. ఫరీదాబాద్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, నోయిడా అంతటా ఇదే పరిస్థితి. ఓ రెండ్రోజులు ప్రజలు ఇబ్బందులు పడక తప్పదంటున్నారు వాతావరణ అధికారులు.

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పొగ బాగానే ఏర్పడింది. చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. నిన్న రాత్రి ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి 250 కాల్స్ వచ్చాయంటే... ఎన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయో చూసుకోండి మరి.



 

Diwali 2019 : దీపావళిని సెలబ్రిటీలు ఎలా జరుపుకున్నారంటే...


Loading...
ఇవి కూడా చదవండి :

TSRTC Strike : ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ... ఏం జరుగుతుంది?

Health Tips : మంట, నొప్పులను తరిమికొట్టే 7 అద్భుత ఆహారాలు

Health Tips : రోజూ 30 నిమిషాలు నడిస్తే...మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..


Health Tips : నిమ్మకాయ తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు... ఇలా చెయ్యండి...

Health Tips : ఒక రోజులో ఎంత పసుపు వాడితే మంచిదో తెలుసా?
First published: October 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...