హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Drugs Container: ఈ కంటైనర్ నిండా డ్రగ్స్.. 20 టన్నులు.. రూ.1725 కోట్లు.. అంత ఈజీగా ఎలా తీసుకొచ్చారు?

Drugs Container: ఈ కంటైనర్ నిండా డ్రగ్స్.. 20 టన్నులు.. రూ.1725 కోట్లు.. అంత ఈజీగా ఎలా తీసుకొచ్చారు?

కంటైనర్‌లో డ్రగ్స్

కంటైనర్‌లో డ్రగ్స్

Drugs seized in Mumbai: ముంబైలో దొరికిన ఈ డ్రగ్స్‌ మార్కెట్‌ విలువ దాదాపు 1725 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను చూసి పోలీసులు కూడా ఖంగుతిన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మనదేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా (Drugs Smuggling ) రోజురోజుకూ పెరిగిపోతోంది. విదేశాల నుంచి నౌకల్లో తీసుకొచ్చి.. దేశంలోకి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. పెద్ద పెద్ద నగరాలే కాదు.. పట్టణాల్లో కూడా మత్తు పదార్థాల వాడకం విచ్చల విడిగా పెరిగిపోయింది. అధికారుల తనిఖీల్లో ఊహించనంత స్థాయిలో డ్రగ్స్ పట్టుబట్టుతున్నాయి. అధికారులకు దొరికేవే టన్నుల్లో ఉంటే.. వాళ్ల కళ్లు గప్పి ఇంకా ఎంత తరలిస్తున్నారో.. అర్థం చేసుకోవచ్చు. తాజాగా ముంబైలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ (Drugs Seized in Mumbai) దొరికాయి. ముంబైలోని న్హావ శేవ నౌకాశ్రయంలో (Nhava sheva Port) ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు చేసిన తనిఖీల్లో టన్నులకు టన్నులు హెరాయిన్ పట్టుబడింది. ఓ కంటైనర్‌లో దాచిన.. 20 టన్నుల హెరాయిన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఇటీవల పట్టుకున్న డ్రగ్స్‌ కేసులో అతి పెద్దది ఇదే. ముంబైలో దొరికిన ఈ డ్రగ్స్‌ మార్కెట్‌ విలువ దాదాపు 1725 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను చూసి పోలీసులు కూడా ఖంగుతిన్నారు. ఆయుర్వేదంలో వినియోగించే అతి మధురానికి (Licorice) హెరాయిన్ పూతపూసి వీటిని తరలించారని పేర్కొన్నారు.

  డ్రగ్స్‌ను గ్రాముల్లో ప్యాక్ చేసి తరలించాలన్నా.. చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది.. ఏకంటా టన్నులకు టన్నులు ఇక్కడికి ఎలా తరలించారన్నదే అర్ధం కావడం లేదు. వ్యవసాయ ఎరువులు తరలించినంత ఈజీగా.. పెద్ద పెద్ద బ్యాగుల్లో డ్రగ్స్‌లు తరలించారంటే... కేటుగాళ్లు ఎంత పక్కాగా స్కెచ్‌లు వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు పోర్టుల్లో భద్రత కరొవడిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అధికారుల హస్తం లేనిదే.. ఎంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను దేశంలోకి ఎవరూ తీసుకురాలేరన్న ఆరోపణలు వస్తున్నాయి.

  కాగా, ఢిల్లీ పోలీసులు (Delhi Poilce) కొన్ని రోజుల క్రితం ఆప్ఘనిస్తాన్‌కు చెందిన ఓ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. ఇద్దరు ఆఫ్ఘన్ జాతీయులను అరెస్టు చేసి.. 1200 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సరుకును ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎలా తెస్తున్నారు?ఎవరికి ఇవ్వబోతున్నారు? అనే వివరాలను విచారణలో కూపీ లాగారు. ఐతే వారి విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ముంబై పోర్టుల్లో పెద్ద మొత్తంలో సరకు ఉందని చెప్పారు. ముఖ్యంగా న్హావ శేవ పోర్టులో ఓ రహస్య కంటైనర్ ఉందని.. అందులో పెద్ద మొత్తంలో హెరాయిన్ ఉందని చెప్పారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా... ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం ముంబై చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోర్టులోని కంటైనర్‌లో తనిఖీ చేయగా.. ఓ కంటైనర్‌లో ఏకంగా అక్కడ 20 టన్నుల హెరాయిన్ లభ్యమైంది.

  మరోవైపు 2 రోజుల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ మాఫియాను నడిపిస్తున్న ఆఫ్ఘన్ పౌరుడు నూర్జాహి US జైలు నుండి విడుదలయ్యాడు. 1980ల్లో ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో తనకు మించి ఎవరూ లేరన్నంత చందంగా చెలరేగిపోయాడు. కొన్నాళ్లు డ్రగ్స్ ఏజెంట్‌గా అమెరికాకు కూడా పనిచేశాడు. ఆ అనంతరం అమెరికా ఏజెంట్లతో విబేధాల కారణంగా నూర్జాహీ అమెరికాలోనే జైలు పాలయ్యాడు. ఇప్పుడు అతడు జైలు నుంచి విడుదల కావడంతో.. మళ్లీ ట్రాఫికింగ్ పెరుగుతుందేమోన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Drugs, Mumbai

  ఉత్తమ కథలు