Home /News /national /

DELHI POLICE SEIZE 354 KGS HEROIN WORTH RECORD RS 2500 CR FOUR PERSONS ARRESTED SK

Delhi Drugs Case: రూ.2500 కోట్ల హెరాయిన్ సీజ్.. దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిందితులు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఏకంగా రూ.2,500 కోట్లు విలువచేసే 350 కిలోల హెరాయిన్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు?

ఇంకా చదవండి ...
    మన దేశంలో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. శనివారం ఫరీదాబాద్‌లోని ఓ ఇంటి నుంచి రూ.350 కిలోల డ్రగ్స్ పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితుల్లో ఒక ఆఫ్ఘనిస్తాన్ దేశస్తుడితో పాటు ఢిల్లీకి చెందిన ఒకరు, పంజాబ్‌కు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఘిటోర్ని ప్రాంతంలో డ్రగ్స్ డెలివరీ చేసేందుకు ఓ కాశ్మీర్ వ్యక్తి వెళ్తున్నాడని నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ప్లాన్‌తో హజ్రత్ అలీ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి కిలో హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అతడు కాశ్మీర్‌కు చెందిన వాడు కాదు. ఆఫ్ఘనిస్తాన్‌ పౌరుడు. ఇండియాకు వచ్చి కాశ్మీర్లోని అనంత్‌నాగ్‌లో నివసిస్తున్నాడు.

    హజ్రత్ అలీ విచారణలో ఈ డ్రగ్స్ ముఠా గురించి మరిన్ని కీలక విషయాలు తెలిశాయి. అతడు ఇచ్చిన సమాచారంతోనే రెండు కార్ల నుంచి 116 కేజీలు, 115 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుల నివాసంలో తనిఖీలు చేయగా మరో 70 కేజీల మాదకద్రవ్యాలు దొరికాయి. మొత్తంగా 350 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.

    ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన హజ్రత్ అలీతో పాటు ఢిల్లీ ఘిటోర్నికి చెందిన రిజ్వాన్ అహ్మద్, పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన గురుజోత్ సింగ్,గురుదీప్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. నవ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తి సూచనలతోనే తాము డ్రగ్స్ దందా చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఐతే నవ్‌ప్రీత్ ప్రస్తుతం పోర్చుగల్‌లో నివసిస్తున్నాడు. నిందితుల నివాసం నుంచి డ్రగ్స్ తయారీకి వినియోగించే 100 కేజీల ఇతర రసాయనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి పాకిస్తాన్ ముఠాతోనూ సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    మనదేశంలో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద డ్రగ్స్ రాకెట్‌గా పోలీసులు భావిస్తున్నారు. 2019లో 330 కేజీల హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఇరాన్‌లోని చాబహార్ పోర్టు నుంచి ముంబై మీదుగా పంజాబ్‌కు తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇప్పటి వరకు అదే రికార్డు. తాజాగా 350 కేజీల డ్రగ్స్ దొరికాయి. ఇక ఇటీవల మనదేశంలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. సోమవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. అంత ముందు ఢిల్లీలో రూ.90కోట్ల విలువైన 17 కేజీల హెరాయిన్‌ను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఈఏడాది జూన్ వరకు డ్రగ్స్‌కు సంబంధించి 14 కేసులు నమోదయ్యాయి. 18 మంది విదేశీయులతో పాటు ఇద్దరు భారతీయులు అరెస్ట్ అయ్యారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Drugs, Drugs case, Drugs racket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు