హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi : మూడు నిమిషాల్లో మూడు కిలోమీటర్లు.. ఉరికి వేలాడుతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు.. !

Delhi : మూడు నిమిషాల్లో మూడు కిలోమీటర్లు.. ఉరికి వేలాడుతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు.. !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi : మూడు నిమిషాల్లో ( 3 minutes ) మూడు కిలోమీటర్లు ప్రయాణించిన పోలీసులు (police ) ఉరికి వేలాడుతున్న ఓ ప్రాణాన్ని కాపాడారు.. సంఘటన ఢిల్లీలో ( Delhi ) చేటు చేసుకొనగా పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

  ప్రస్తుత సమజాంలో పోలీసులు ( police ) శాంతి భద్రతలతో పాటు అనేక అంశాలపై ఫోకస్ పెట్టారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఉన్నామంటూ వారి భాద్యతను నిర్వహిస్తున్నారు. దీంతో ఏక్కడ ఏం జరిగినా నిమిషాల్లో సంఘటన స్థలంలో వాలిపోతున్నారు. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువతూ ప్రశంశసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఓ చిన్నారీ ఫోన్‌ కాల్‌కు సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడారు.

  ఢిల్లీ పోలీసులు ( Delhi police ) తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి తన భార్యతో ఏదో విషయమై గొడవ పడ్డాడు. వాగ్వాదం అనంతరం ఆ భార్య ( wife ) పొలానికి వెళ్లిపోయింది. భార్యతో గొడవ కారణంగా మనస్తాపానికి గురైన భర్త​ క్షణికావేశంలో ఆత్మహత్య ( suicide ) చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ బాధతో మద్యంతాగి ( drink ) ఇంట్లోకి వెళ్లి కోపంతో తలుపువేసుకున్నాడు. ఇదంతా గమనించిన అతని కుమార్తె ( daughter ) వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది.

  ఇది చదవండి : తాలిబాన్‌ మరో అరాచకం.. జాతీయ మహిళ వాలిబాల్ క్రిడాకారిణి తల నరికారు... !


  దీంతో ఆ యువకుడు తన చెల్లికి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించాడు. సోదరుడు చెప్పిన వెంటనే ఆ బాలిక పోలీసులకు ( police ) సమాచారం ( information ) అందించింది. అయితే ఆ బాలిక చేసిన ఫోన్‌కు వెంటనే స్పందించిన పోలీసులు కేవలం 3 నిమిషాల్లోనే ( 3 minutes ) 3 కిలోమీటర్లు ( three kilomeaters ) ప్రయాణించి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

  ఇది చదవండి : ఉద్యోగాలు వీడుతున్న లక్షల మంది... కరోనా తర్వాత అమెరికన్లలో కొత్త ధోరణి..


  వారు కిటికీలో ( window ) నుంచి చూడగా ఉరికి వేలాడుతున్న ( hanging ) వ్యక్తి కనిపించారు. అయితే విషయం అప్పటికే స్థానికులకు తెలియడంతో అందరు బాధితుడి ఇంటి వద్ద గుమికూడారు. ఉరి వేసుకున్న వ్యక్తి చనిపోయినట్టుగానే భావించి చూస్తూ పోలీసులు వచ్చే వరకు ఉండిపోయారు. అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత కిటికిల్లోంచి వేలాడుతున్న వ్యక్తిని గమనించారు. అతనిలో ఇంకా కొంచెం కదలిక ఉందని పోలీసుల్లో ఒకరు పసిగట్టి వెంటనే తలుపులు బద్దలు కొట్టి అతని ప్రాణాలను కాపాడి చికిత్స కోసం ఆసుపత్రికి ( Hospital ) తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి క్షేమంగా ఉన్నట్టు సమాచారం.

  ఇది చదవండి : ఆ రైతులకు రైతు భీమా, రైతు బంధులు రద్దు.. గంజాయి సాగుపై సీఎం కీలక నిర్ణయం


  ఇటివల దేశరాజధాని డిల్లీలో నేరాలు ఎక్కువగా పెరిగిన నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ కావడంతో పాటు సమస్యల పరిష్కారినికి ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు.  ఈ క్రమంలోనే అంత్యంత రద్దీగా ఉన్న ఢిల్లీ ట్రాఫిక్‌లో కేవలం మూడు నిమిషాల్లో మూడు కిలోమీటర్లు వెళ్లి మనిషి ప్రాణాలు కాపాడడం రియల్లీ గ్రేట్.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Delhi, Delhi police

  ఉత్తమ కథలు