భారత ఆర్మీ రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఆర్మీ ఉద్యోగి.. అతడితో సంబంధాలు

ప్రతీకాత్మక చిత్రం

పాకిస్తాన్‌కు సైనిక రహస్యాలను చేరవేస్తున్న హబీబ్ అనే వ్యక్తిని ఇప్పటికే రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. అతడిలో పరమ్ జిత్‌కు సంబంధాలున్నాయి. గతంలో పరమ్ జిత్ పొఖ్రాన్‌లో పనిచేశాడు. ఆ సమయంలోనే హబీబ్‌తో పరిచయం ఏర్పడింది

  • Share this:
    ఆర్మీలో పనిచేయాలని ఎంతో మంది యువత కల. దేశానికి సేవ చేయాలని.. అందుకోసం సైన్యంలో చేరాలని అనుకుంటారు. కానీ ఆర్మీలోనే పనిచేసే ఓ ఉద్యోగి మాత్రం ఇంటి దొంగగా మారాడు. సొంత దేశాన్ని దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్‌తో చేతులు కలిపాడు. భారత ఆర్మీ రహస్యలను పాకిస్తాన్ గూఢచార సంస్థ ISIకి చేరవేస్తూ ఆర్మీ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు. అతడిని అరెస్ట్ చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. పరమ్ జిత్ అనే వ్యక్తి ఆగ్రా కంటోన్మెంట్‌లో క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పాకిస్తాన్‌కు సైనిక రహస్యాలను చేరవేస్తున్న హబీబ్ అనే వ్యక్తిని ఇప్పటికే రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. అతడిలో పరమ్ జిత్‌కు సంబంధాలున్నాయి. గతంలో పరమ్ జిత్ పొఖ్రాన్‌లో పనిచేశాడు. ఆ సమయంలోనే హబీబ్‌తో పరిచయం ఏర్పడింది. డబ్బుల కోసం భారత సైనిక రహస్యాలను అతడికి అందజేసేవాడని పోలీసులు గుర్తించారు. హబీబ్, పరమజిత్ హవాలా మార్గంలో డబ్బులను స్వీకరిస్తున్నారని తెలిసింది. హబీబ్ పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్సులో ఉంటున్న తన బంధువుల సహకారంతో ఇన్నాళ్లు గూఢచర్యాన్ని కొనసాగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

    రాజస్థాన్‌లోని బీకనేర్‌కు చెందిన హబీబ్ ఖాన్ చాలా ఏళ్లుగా కూరగాయల సరఫరా కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పొఖ్రాన్‌లోని ఆర్మీ బేస్ క్యాంప్‌కు కూరగాయలు సరఫరా చేస్తున్నాడు. అంతేకాదు పొఖ్రాన్‌లోని ఇందిరా రసోయ్ క్యాంటిన్‌కు కూడా ఇతడే వెజిటబుల్ సప్లయర్‌గా ఉన్నాడు. ఐతే బేస్ క్యాంప్‌లో పనిచేసే అధికారులు డబ్బులు ఇచ్చి ఆర్మీకి చెందిన కీలక పత్రాలను సేకరిస్తున్నాడు. వాటిని పాకిస్తాన్ ఐఎస్ఐకు రహస్యంగా చేరవేస్తున్నాడు. వెజిటబుల్ సప్లయర్ ముసుగులో కొన్ని రోజులుగా భారత ఆర్మీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపిస్తున్నాడు. ఇటీవల నిఘా వర్గాలు హబీబ్ ఖాన్‌ కార్యకలాపాలపై దృష్టిసారించాయి. పక్కా సమాచారంతో పోలీసులను అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పొఖ్రాన్‌లో హబీబ్ ఖాన్‌ను అరెస్ట్ చేశాయి. విచారణ కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. అతడు ఇచ్చిన సమాచారంతోనే ఆర్మీతో పనిచేసే పరమ్‌జిత్‌ను అరెస్ట్ చేశారు. వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఆర్మీ ఇంకా నెట్‌వర్క్ ఏమైనా ఉందా? ఇప్పటి వరకు ఎలాంటి సైనిక రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేశారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: