స్కూళ్లకు సెలవులు ఇవ్వండి... ప్రభుత్వానికి పేరెంట్స్ విజ్ఞప్తి

స్కూళ్లకు సెలవులు ఇవ్వండి... ప్రభుత్వానికి పేరెంట్స్ విజ్ఞప్తి

Delhi : ఢిల్లీలో పొగ కాలుష్యం బాగా పెరిగిపోవడంతో... స్కూల్ పిల్లలు ఊపిరి తీసుకోవడం కష్టమైపోతోంది. అందుకే కేజ్రీవాల్ సర్కార్‌కి పేరెంట్స్ వినతులు చేస్తున్నారు.

 • Share this:
  Delhi : ఇదివరకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లడాన్ని ప్రతి ఒక్కరూ గొప్ప విషయంగా భావించేవారు. అక్కడ నివసించడాన్ని అరుదైన అవకాశం అనుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఢిల్లీకి వెళ్లేవారెవరైనా, అక్కడ నివసించాలని నిర్ణయం తీసుకుంటే... ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమని చెబుతున్నారు తోటి వారు. ఎందుకంటే... ఢిల్లీ... ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా మారిపోయింది. అక్కడ నివసించేవాళ్లు, గాలి పీల్చే వాళ్లకు ఊపిరి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. పొగ వల్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా... ప్రతీ సంవత్సరం నవంబర్ 1 నుంచీ 20 వరకూ... పొగ మంచు సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై ఢిల్లీ, NCR ప్రాంతాల్లో సర్వే జరపగా... 74 శాతం తల్లిదండ్రులు... సెలవులు ప్రకటించాలనే కోరారు.

  సెలవుల వల్ల నష్టపోయే పని దినాలను... ఇతర కాలాల్లో సెలవుల్ని తగ్గించడం ద్వారా కవర్ చెయ్యాలని పేరెంట్స్ కోరారు. ఇలా చేస్తే... విద్యార్థుల విద్యా సంవత్సరానికి ఎలాంటి సమస్యా ఉండదని అభిప్రాయపడ్డారు.

  నిజానికి ఈసారి ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం నవంబర్‌లో వేర్వేరు సమయాల్లో చాలా రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కానీ... ఇలా ప్రకటించిన సెలవుల్ని మళ్లీ భర్తీ చేసే ప్రక్రియ మాత్రం చేపట్టలేదు. అందువల్ల ఈ సంవత్సరం తమ పిల్లల విద్యపై సెలవులు ప్రతికూల ప్రభావం చూపుతాయని పేరెంట్స్ అంటున్నారు.

   

  Pics : ముంబై ముద్దుగుమ్మ రోహిణీ ముంజల్ క్యూట్ ఫొటోస్  ఇవి కూడా చదవండి :

  నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణం... ఇవీ కీలక అంశాలు

  నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు

  Health Tips : గొంతు గరగరగా ఉందా... ఇలా చెయ్యండి చాలు... సమస్య పరార్

  వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు

  ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం


   
  First published: