Home /News /national /

DELHI ON ALERT AFTER 400 PARLIAMENT STAFF TEST COVID 19 POSITIVE CASES OF SELF TESTING KITS RISES MKS

Delhi: పార్లమెంట్‌లో కరోనా కలకలం.. 400 సిబ్బందికి పాజిటివ్.. సెల్ఫ్ టెస్టింగ్ కిట్లకు భారీ గిరాకీ

పార్లమెంట్ లో కొవిడ్ కలకలం

పార్లమెంట్ లో కొవిడ్ కలకలం

ఢిల్లీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. పార్ల‌మెంట్ భ‌వ‌న్‌లో క‌రోనా క‌ల‌క‌లం చెలరేగింది. గడిచిన రెండు రోజులుగా పార్ల‌మెంట్ లో ప‌నిచేస్తున్న సిబ్బంది 400 మంది కొవిడ్ బారినపడ్డారు. వివరాలివి..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ తారా స్థాయికి పరుగులు తీస్తోంది. మహారాష్ట్రకు పోటీగా దేశరాజధాని ఢిల్లీలోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. పార్ల‌మెంట్ భ‌వ‌న్‌లో క‌రోనా క‌ల‌క‌లం చెలరేగింది. గడిచిన రెండు రోజులుగా పార్ల‌మెంట్ లో ప‌నిచేస్తున్న సిబ్బంది 400 మంది కొవిడ్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బందికి సామూహిక టెస్టులు నిర్వహించగా, వాళ్లలో చాలా మంది వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది.

పార్లమెంట్ లో కొవిడ్ వ్యాప్తి నిర్ధారణ కావడంతో ఉద్యోగులంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 400 మంది సిబ్బందికి క‌రోనా సోక‌డంతో పార్ల‌మెంట్‌ను శానిటైజ్ చేస్తున్నారు. ఢిల్లీలో ప్ర‌స్తుతం నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాజిటివిటీ రేటు పెరుగుతుండ‌టంతో వీకెండ్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఢిల్లీ రాష్ట్ర‌ప్ర‌భుత్వం వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోమ్ సౌక‌ర్యాన్ని క‌ల్పించింది.

Covid-19: ఫిబ్రవరి 15 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్ -సోమవారం నుంచి సెలూన్లూ మూసివేత


కొవిడ్ వ్యాప్తి పెరగడంతో ఢిల్లీలో సెల్ఫ్ టెస్టింగ్ కిట్లకు భారీ గిరాకి పెరిగింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా వ్యాపించే ఓమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నందున దేశ రాజధానిలో కోవిడ్ -19 కేసులు వారంలో ఐదు రెట్లు పెరిగాయి. ఢిల్లీలో ప్రతిరోజూ దాదాపు 5,000-10,000 సెల్ఫ్-టెస్టింగ్ కిట్‌లు అమ్ముడవుతున్నాయని, రోజురోజుకూ వీటి డిమాండ్ పెరుగుతోందని ఢిల్లీ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ కెమిస్ట్ అలయన్స్ (DRDCA) ప్రెసిడెంట్ సందీప్ నంగియాను తెలిపారు.

rain alert : తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4రోజులు వర్షాలు.. రాజధానిని ముంచేసిన వాన


కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధానిలో వారాంతపు కర్ఫ్యూ మొదటి రోజున ఢిల్లీ పోలీసులు శనివారం పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు, బారికేడ్లను పెంచారు మరియు చట్టపరమైన చర్యల గురించి ప్రజలను హెచ్చరించారు. శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూ ప్రారంభమైందని, సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుందని అధికారులు ముందుగా తెలిపారు.
Published by:Madhu Kota
First published:

Tags: Covid, Delhi, Omicron, Parliament

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు