Home /News /national /

DELHI NCR SCHOOLS COLLEGES SHUT 50 WFH TRUCK ENTRY BANNED CONSTRUCTION STOPPED AS AIR QUALITY DIPS CAQM ORDERS MKS

Delhi : ఆ దెబ్బకు ఢిల్లీ మూసివేత -నిర్మాణ పనులు, బడులు బంద్, థర్మల్ విద్యుత్ నిలిపివేత : కేంద్రం ఆదేశాలివే

ఢిల్లీలో కాలుష్యం

ఢిల్లీలో కాలుష్యం

ఢిల్లీ నగరం, నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR) పరిధిలో తిరిగి లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తాయి. ఢిల్లీ నగరంతోపాటు చుట్టుపక్కల 300 కిలోమీటర్ల పరిధిలోని 4 రాష్ట్రాలకూ మూసివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పూర్తిగా దెబ్బతినడంతో..

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారి కాటుకు గురై నిన్న మొన్ననే దాదాపు పూర్తిగా తెరురుకున్న దేశ రాజధాని ఢిల్లీ.. ఇప్పుడు కాలుష్యం దెబ్బకు మళ్లీ మూతపడింది. ఢిల్లీ నగరం, నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR) పరిధిలో తిరిగి లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తాయి. ఢిల్లీ నగరంతోపాటు చుట్టుపక్కల 300 కిలోమీటర్ల పరిధిలోని 4 రాష్ట్రాలకూ మూసివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పూర్తిగా దెబ్బతినడమే తాజా ఉత్తర్వులకు కారణం. ఢిల్లీలో కాలుష్య నివారణకు సంబంధించి శక్తిమంతమైన సంస్థ, కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన కమిషన్ ఫర్ ఎయిర్ క్వారిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం).. ఢిల్లీ మూసివేతపై మంగళవారం అర్ధరాత్రి తర్వాత వరుస ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. వివరాలివి..

ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో వాయి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి, ఎయిర్ క్వాలిటీ దెబ్బతినడంతో అసాధారణ పరిస్థితులు తలెత్తాయి. ఈ అంశంపై అటు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తుండగా, ఇటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు ప్రభుత్వాల కీలక శాఖలు మంగళవారం నాడు పలు దఫాల సమీక్షలు నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎం).. ఢిల్లీ కాలుష్యంపై ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కీలక ఆదేశాలిచ్చింది. ఉత్తర్వులు, సూచనల రూపంలో వెలువడిన ఆ అంశాలు ఏవంటే..

ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలను పూర్తిగా మూసేసి ఉంచుతారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా ఎవరూ విద్యా సంస్థల్ని తెరవడానికి వీల్లేదు. కాలుష్యానికి ప్రధాన కారణమైన వాహనాలను నిరోధించే క్రమంలో.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కనీసం 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. తక్షణం అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వులు నవంబర్ 22 వరకు కొనసాగుతాయని సీఏక్యూఎం తెలిపింది. అంతేకాదు,

ఢిల్లీ కాలుష్యానికి మరో ప్రధాన కారణమైన నిర్మాణ రంగం సైతం బుధవారం నుంచి పూర్తిగా స్తంభించిపోనుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో ఉన్న యూపీలోని నోయిడాలో అన్ని రకాల నిర్మాణ పనులు, ఆర్‌ఎంసీ, హాట్‌ మిక్స్‌ప్లాంట్లు, డీజిల్‌ జనరేటర్ల వాడకాన్ని నాలుగు రోజుల పాటు గ్రేటర్‌ నోయిడా అథారిటీ నిషేధించింది. ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ సూచనల మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అదే క్రమంలో..

ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా నగరంలోకి ట్రక్కుల వంటి భారీ వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధించారు. ఢిల్లీ చుట్టూ 300 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 11 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉండగా, వాటిలో ఆరు ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేశారు. నవంబర్ 30 వరకు ఆయా ప్లాంట్లలో బొగ్గు మండించడానికి వీల్లేదని సీఏక్యూఎం పేర్కొంది.
Published by:Madhu Kota
First published:

Tags: Delhi, Delhi pollution

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు