హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Rain: ఢిల్లీ కకావికలం.. భారీ వర్షం, ఈదురుగాలుల విలయం.. కుండపోతకు ఎండ 11 డిగ్రీలు డ్రాప్

Delhi Rain: ఢిల్లీ కకావికలం.. భారీ వర్షం, ఈదురుగాలుల విలయం.. కుండపోతకు ఎండ 11 డిగ్రీలు డ్రాప్

ఢిల్లీలో భారీ వర్షానికి స్తంభించిన రవాణా

ఢిల్లీలో భారీ వర్షానికి స్తంభించిన రవాణా

భయానక ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దేశరాజధాని ఢిల్లీని చిగురుటాకులా వణికించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీ, ఎన్సార్సీ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అసాధారణ రీతిలో వర్షం కురుస్తున్నది.

భారీ వృక్షాలను సైతం నేలమట్టం చేస్తూ.. పటిష్టమైన గోడలను సైతం అటు ఇటు ఊపేస్తూ.. భయానక ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దేశరాజధాని ఢిల్లీని చిగురుటాకులా వణికించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీ, ఎన్సార్సీ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అసాధారణ రీతిలో వర్షం కురుస్తున్నది. చెట్లు కరెంటు వైర్లపై పడిపోవడంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

గంటలపాటు కురిసిన వర్షానికి వరద ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో సగానికిపైగా నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రమాదకర వాతావరణంలో ప్రయాణించలేక పలు విమాన సర్వీసులు రద్దు కావడంతో ఎయిర్ పోర్టులో జనం పడిగాపులు కాస్తున్నారు. తుపాను లాంటి వర్షం ఇంకొన్ని గంటలు కొనసాగనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది.

భారీ వర్షానికి నిలిచిపోయిన నీరు

Petrol Diesel Prices : భారీ షాక్.. పెట్రో ధరల తగ్గింపు సాకుతో కొత్తగా రూ.లక్ష కోట్ల అప్పులు


ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు,మెరుపులతో కూడిన గాలివాన కురుస్తోంది. సోమవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాలలో గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు ఉరుములతో కూడిన తుపాన్ కొనసాగుతున్నది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షానికితోడు ఈదురుగాలులు బలంగా వీస్తుండటంతో ప్రజలు ఇల్లు వదిలి బయటికి రావొద్దని ఐఎండీ సూచించింది. గాలి బలంగా వీస్తుండటంతో ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయాలని, ప్రయాణాలను నివారించాలని కూడా ఐఎండీ కోరింది.

బలమైన ఈదురుగాలులకు ఎయిర్ పోర్టులో స్కిడ్ అయిన జెట్ ఎయిర్ వేస్ విమానం

CM KCR నా శిష్యుడే -రూ.10వేల కోట్లు ఇవ్వబోయా.. నన్ను చేస్తానని వైఎస్సారే భూస్థాపితం : KA Paul


వర్షం పడుతోన్న సమయంలో ప్రజలు చెట్ల కింద తలదాచుకోవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఐఎండీ సూచించింది. కాంక్రీట్ అంతస్తులపై పడుకోవద్దని, కాంక్రీట్ గోడలకు ఆనుకొని ఉండవద్దని, ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అన్‌ప్లగ్ చేయాలని ఐఎండీ తెలిపింది. గాలివాన వల్ల కచ్చాఇళ్లు, గోడలు, గుడిసెలు పడిపోతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. భారీవర్షాల వల్ల ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

రోడ్లు జలమయం

Edible oil | Cooking oil : ఇక వంట నూనెల వంతు.. తగ్గనున్న ధరలు.. ఇవే కారణాలు..

ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానాల గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలని, సంబంధిత సంస్థల అధికారులతో టచ్‌లో ఉండాలని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు సూచించారు. వానతోపాటు బలమైన గాలులు వీస్తుండటంతో విమానాలు ఆలస్యంగా నడుస్తాయని జెట్‌ఎయిర్‌వేస్‌ వెల్లడించింది.  ఓ విమానం రన్ వేపై జారిపోయిన ఫొటో ఒకటి వైరలవుతోంది. కాగా, ఇవాళ ఒక్కరోజు కురిసిన వర్షానికే ఢిల్లీలో ఉష్ణోగ్రత ఏకంగా 11 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పడిపోయింది.

First published:

Tags: Delhi, Heavy Rains, IMD

ఉత్తమ కథలు