దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి ఎంతో కొంత అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ప్రయత్నిస్తున్నారు. కరోనా కారణంగా చాలా కాలంపాటు ఆంక్షలు కొనసాగడంతో కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఆంక్షలు ఎత్తివేయడంతో రోడ్డుమీద వాహనాలు తిరిగి పరుగులు తీస్తున్నాయి. దీంతో వాయుకాలుష్యం తిరిగి మొదలైంది. మరోవైపు పంజాబ్, హర్యానా, యూపీ సరిహద్దుల్లో పంట వ్యర్థాల దహనంతో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో నగరంలో వాయు కాలుష్య కారకాల అధిక స్థాయికి చేరకుండా చర్యలు చేపడుతున్నారు. పంట వ్యర్థాలను రైతులు దహనం చేయకుండా చూడాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో గాలి కాలుష్యానికి వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు కూడా ఒక కారణం. ఈ నేపథ్యంలో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చర్యలకు ఉపక్రమించింది. వాహనాల నుంచి వెలువడే కర్భన ఉద్గారలకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా ప్రజల ముందుకు సాగేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీ వ్యాప్తంగా ఇంధన కేంద్రాల్లో (fuel stations).. వాహనాల కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలను (Pollution Under Control Certificate) పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను మోహరించింది. వాహనదారులు పెట్రోల్ పంప్‌ల వద్ద తమ బృందాలకు సంబంధిత పత్రాలను చూపించాలని ఢిల్టీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (Delhi Transport Department) కోరింది.
చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ (PUCC) లేని వాహనాలపై నిబంధనల ప్రకారం ముందుకు సాగుతామని ట్రాన్స్పోర్ట్ అధికారులు తెలిపారు. కాలుష్య నియంత్రణ పత్రాలను తనిఖీ చేసేందుకు ఢిల్లీలోని ఇంధన కేంద్రాల్లో తమ బృందాలను మోహరించామని పేర్కొన్నారు. వాహనదారుల కాలుష్య నియంత్రణ పత్రాలు తనిఖీ చేయడం, ఆ పత్రాలు లేకపోతే వాటిని పొందమని చెప్పడమే ఈ బృందాల ప్రధానమైన డ్యూటీ అని చెప్పారు.
అయితే సాధారణ తనిఖీలతో పోల్చితే ఇవి భిన్నమైనవని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో పాల్గొంటున్న బృందాలు వాహనదారులకు ఎటువంటి జరిమానా విధించవని అన్నారు. వాహనదారులు ఒక సెంటర్లో సంబంధిత పత్రాలు పొందేలా వారిని ప్రోత్సహిస్తారని చెప్పారు. అయితే ఇలా చేయడానికి నిరాకరించిన వారిపై, తప్పించుకోవాలని చూసిన వారిపై మాత్రం చలాన్లు విధించబడవచ్చు అని అన్నారు.
ఏపీ సీఎం YS Jagan ఎన్డీయేలో చేరాలి.. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు..
మోటార్ వాహన చట్టం (Motor Vehicle Act) 1993 ప్రకారం.. చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం పొందడంలో విఫలమైన వాహన యజమానులు సెక్షన్ 190 (2) ప్రకారం చలానా విధించబడుతుంది. దీని వలన ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 10,000 వరకు జరిమానా లేదా రెండూ కూడా భరించాల్సి ఉంటుంది. వాహనదారుడు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కోల్పోవచ్చు.
ఇక, ఇక, ఢిల్లీలో రవాణా శాఖ అధీకృత 1,000 కాలుష్య తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. ఇవి వాహనదారులకు అందుబాటులో ఉండేలా నగరంలోని పెట్రోల్ పంపులు, వర్క్‌షాప్‌లలో ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా వాహనాలకు కాలుష్య తనిఖీలను నిర్వహిస్తారు. నిర్దేశించిన కాలుష్య నిబంధనలను పాటించే వాహనాలకు PUC సర్టిఫికెట్లను జారీ చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.