కేంద్రం ప్రతిపాదించిన విధంగా ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం, అలవెన్సులలో 66% పెంపుదలను అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రభుత్వం మంగళవారం ఆమోదించింది. అయితే వారు ఇప్పటికీ దేశంలో అత్యల్ప జీతం(Salary) పొందే శాసనసభ్యుల జాబితాలో ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో దశాబ్దం తర్వాత వచ్చిన పెంపుదల ఆమోదం పొందింది. ప్రస్తుతం ఉన్న నెలవారీ జీతం, అలవెన్సులను(Allowance) రూ. 54,000 నుండి రూ. 90,000 కు పెంచినట్లు ఢిల్లీ (Delhi) ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం, అలవెన్సులు ఇతర రాష్ట్రాల వారితో సమానంగా ఉండాలని కేజ్రీవాల్ ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖని అభ్యర్థించిందని పేర్కొంది. అయితే కేంద్ర హోంశాఖ ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదనను పరిమితం చేసింది.
జీతం కేవలం రూ. 30,000 మాత్రమే పెంచింది. ఇప్పుడు ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం, అలవెన్స్‌లను కేంద్ర హోంశాఖ రూ. 90,000కి పరిమితం చేసింది. ఇంతకుముందు ఎమ్మెల్యేలకు నెలకు రూ. 12,000 జీతం, మిగిలిన మొత్తాన్ని అలవెన్సులుగా కలిపి రూ. 54,000 చెల్లించేవారు.నియోజకవర్గ భత్యం రూ. 18,000 నుంచి రూ. 25,000కి, సెక్రటేరియల్ అలవెన్స్ రూ. 10,000 నుంచి రూ. 15,000కి, టెలిఫోన్ అలవెన్స్ రూ. 8,000 నుంచి రూ. 10,000కి, కన్వేయన్స్ అలవెన్స్ రూ. 6000 నుంచి రూ. 10,000కి పెంచారు.ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం, అలవెన్సులు చివరిసారిగా 2011లో సవరించబడ్డాయి.
భారతదేశంలోని చాలా ప్రాంతాల కంటే ఢిల్లీలో జీవన వ్యయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేల జీతాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేల జీతాలు, ఇతర అలవెన్సులను ఓసారి పరిశీలిస్తే.. ఉత్తరాఖండ్ (రూ. 1.98 లక్షలు), హిమాచల్ ప్రదేశ్ (రూ. 1.9 లక్షలు), హర్యానా (రూ. 1.55 లక్షలు), బీహార్ ( రూ. 1.3 లక్షలు), రాజస్థాన్ ( రూ. 1.42 లక్షలు) మరియు తెలంగాణ ( రూ. 2.5 లక్షలు)గా ఉంది.
PM Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు.. ఏ సమయంలో ఎక్కడ ఉంటారంటే..
ISRO ఖాతాలో మరో విజయం..PSLV C53 ప్రయోగం విజయవంతం
అనేక రాష్ట్రాలు తమ ఎమ్మెల్యేలకు ఇంటి అద్దె, కార్యాలయ అద్దె మరియు సిబ్బంది ఖర్చులు, కార్యాలయ సామగ్రి కొనుగోలు కోసం భత్యం, వాహనం మరియు డ్రైవర్ భత్యం వంటి అనేక ఇతర ప్రోత్సాహకాలను అందిస్తాయి. అయితే ఢిల్లీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. డిసెంబర్ 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల పారితోషికాన్ని నెలకు రూ. 2.10 లక్షలకు పెంచుతూ బిల్లును ఆమోదించింది. అయితే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో బిల్లు శూన్యంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.