హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Minister Satyendar Jain: జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌

Minister Satyendar Jain: జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌

ఢిల్లీ ఆరోగ్యమంత్రి

ఢిల్లీ ఆరోగ్యమంత్రి

Minister Satyendar Jain Sent To ED Custody: మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌(Minister Satyendar Jain)ను సోమ‌వారం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. . ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హయాంలో మంత్రిగా ఉన్న జైన్‌ 2015-16 సంవత్సరంలో కోల్‌కతాకు చెందిన ఒక సంస్థతో అక్రమ నగదు లావాదేవీలు జరిపినట్లు ఈడీ తెలిపింది.

ఇంకా చదవండి ...

Minister Satyendar Jain Sent To ED Custody: మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌(Minister Satyendar Jain)ను సోమ‌వారం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. . ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హయాంలో మంత్రిగా ఉన్న జైన్‌ 2015-16 సంవత్సరంలో కోల్‌కతాకు చెందిన ఒక సంస్థతో అక్రమ నగదు లావాదేవీలు జరిపినట్లు ఈడీ తెలిపింది. పలు షెల్‌ కంపెనీల నుండి సత్యేందర్‌ జైన్‌కు రూ.4.81 కోట్లు అందినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం సత్యేందర్‌జైన్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.4.81 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అయితే ఆ కేసు విచార‌ణ‌లో భాగంగా ఆయ‌నని సత్యేందర్‌ జైన్‌కు వచ్చేనెల 9 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కస్టడీ విధిస్తూ రౌన్‌ ఎవెన్యూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆహారానికి సంబంధించి జైన్‌ విజ్ఞప్తిని కోర్ట్‌ అనుమతించింది. అయితే ప్రతి రోజూ జైన దేవాలయానికి వెళ్లేందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

సత్యేందర్ జైన్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలో ఆరోగ్యం (Delhi Health Minister),హోం, విద్యుత్, PWD, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి & వరదలు, నీటిపారుదల, నీటి శాఖ తదితర శాఖలకు మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన షకుర్‌బస్తీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈయన అరెస్టుతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకులు, కావాలనే ఇలా చేస్తుందని ఆప్ నాయకులు మండిపడుతున్నారు.

ALSO READ Wheat Export: కేంద్రం కీలక నిర్ణయం..గోధుమల ఎగుమతికి ఫిజికల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ తప్పనిసరి

సత్యేందర్ జైన్ అరెస్ట్ పై ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆసక్తికర వ్యాఖలు చేశారు. తాము.. ఈ అరెస్టును జనవరిలోనే ఊహించామని అన్నారు. ఇది సోమవారం నిజమైందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా నిరాధారమైన తప్పుడు కేసని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రి సత్యేందర్‌ జైన్‌పై తప్పుడు కేసు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్‌ పార్టీ నిజాయితీకి నిదర్శనమని అన్నారు. జైన్‌ తప్పు చేసి ఉంటే తానే కఠిన చర్యలు తీసుకునేవాడినని చెప్పారు.

First published:

Tags: Delhi, Enforcement Directorate, Health minister

ఉత్తమ కథలు