Republic Day 2021: రిపబ్లిక్ డే నాడు మెట్రో రైళ్లలో ఈ స్టేషన్లు మూసివేత

రిపబ్లిక్ డే నాడు మెట్రో రైళ్లలో ఈ స్టేషన్లు మూసివేత (File Image)

Republic Day 2021: ఈ రోజుల్లో మెట్రో రైళ్లలో ప్రయాణం కామన్ అయ్యింది. సడెన్‌గా కొన్ని స్టేషన్లు మూసివేస్తారంటే ఇబ్బందే. ఆ స్టేషన్లు ఏవో తెలుసుకుందాం.

  • Share this:
    Republic Day 2021: దేశ రాజధాని ఢిల్లీ... రిపబ్లిక్ డే వేడుకల కోసం రెడీ అవుతోంది. అటు రైతులు కూడా జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఆదివారం ఓ సూచన జారీ చేసింది. జనవరి 26న మెట్రోరైళ్లలో ప్రయాణించాలనుకునేవారికి సూచన అంటూ దాన్ని రిలీజ్ చేసింది. ఆ ప్రకటన ప్రకారం... HUDA సిటీ సెంటర్-సమయ్‌పూర్ బద్లీ మెట్రో లైన్ కొంతవరకూ జనవరి 26న మూసివేస్తారు. అలాగే సెంట్రల్ సెక్రటేరయట్, ఉద్యోగ్ భవన్ మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకూ మూసివేస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్‌ను పాసింజర్లు లైన్ 2 నుంచి లైన్ 6కి వెళ్లేందుకు ఇంటర్‌ఛేంజ్‌గా మాత్రమే ఉపయోగిస్తారు. పటేల్ చౌక్, లోక్ కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లు కూడా ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మూసివేసి ఉంటాయి.

    మరీ ముఖ్యంగా అన్ని మెట్రో రైళ్ల పార్కింగ్ స్లాట్లనూ జనవరి 25 ఉదయం 6 గంటల నుంచి జనవరి 26 మధ్యాహ్నం 2 గంటల వరకూ మూసివేస్తున్నారు. ఇది ఎందుకంటే... సెక్యూరిటీ ఏర్పాట్లలో భాగంగానే ఇలా చేస్తున్నామని DMRC తెలిపింది.


    రైతులు జనవరి 26న చేయబోయే ట్రాక్టర్ ర్యాలీ... ఏయే రూట్లలో వెళ్లాలి అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పోలీసులు తెలిపారు. రైతులు కూడా తాము ఏయే రూట్లలో ర్యాలీ చేస్తారనే అంశంపై తమకు లిఖిత పూర్వకంగా ఎలాంటి ప్రతిపాదనా ఇవ్వలేదని తెలిపారు. ఇంకో రోజు సమయం ఉంది కాబట్టి ఈలోగా రైతులు ప్రతిపాదన ఇస్తే... దానిపై పోలీసులు ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

    ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారు కోపానికి పిన్నమ్మ పిల్లలు... రెచ్చిపోతే... రణరంగమే...

    మొత్తానికి ఈసారి ఢిల్లీలో హడావుడి ఎక్కువగానే ఉంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నగరంలో... ఇలాంటి కార్యక్రమాలు కొంత బిజీ పరిస్థితులు కల్పిస్తున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: