Threat call to PM Modi : చంపుతానంటూ పీఎం మోడికి బెదిరింపు కాల్.. జైలుకు వెళ్లేందుకే ఇలా...!

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)

Threaten call to PM Modi : ఏదైనా నేరం చేసిన వారు జైలుకు వెళితే.. తిరిగి ఎప్పుడు బయట పడతామా అని వేచి చూస్తారు..కాని గతంలో లు జీవితం అనుభవించిన ఓ వ్యక్తి మాత్రం తిరిగి ఎప్పుడు జైలుకు వెళదామా అని చూసాడు..దీంతో త్వరగా జైలుకు వెళ్లడం కోసం ఏకంగా ప్రధాని నరేంద్రమోడినే టార్గెట్ చేసి ఫోన్‌లో బెదిరించాడు.. అనంతరం తాను అనుకున్నట్టు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు.

  • Share this:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానని గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీస్​ కంట్రోల్​ రూమ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో శుక్రవారం ఉదయమే ఢిల్లీ పోలీసులు ఆ ఆగంతకుడిని అరెస్టు చేశారు. ఆగంతకుడు ఢిల్లీలోని ఖజూరీ ఖాస్​ ప్రాంతానికి చెందిన సల్మాన్(22)​అలియాస్​ అర్మాన్​గా గుర్తించారు.

అయితే 2018లో ఓ హత్య కేసులో సల్మాన్ జువైనల్​ కరెక్షన్​ హోమ్​లో ఉండి.. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీసులు వెళ్లడించారు..అయితే జైలు నుండి తిరిగి వచ్చినా.. అతను మళ్లీ జైలుకు వెళ్లాలని భావించాడని చెప్పారు..దీంతో తిరిగి జైలుకు వెళ్లడం కోసం ఏకంగా ప్రధాని మోడీని చంపేస్తా అంటూ గురువారం అర్ధరాత్రి సమయంలో సల్మాన్​ ఈ ఫోన్​ చేశాడని పోలీసులు తెలిపారు. ఫోన్​ కాల్​ రాగానే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫోన్‌ నంబర్‌.. ట్రేస్​ చేశారు.. దీంతో సల్మాన్‌ గుర్తించి అరెస్ట్ చేశారు.

కాగా సల్మాన్ ఫోన్​ కాల్​ చేసే సమయంలో ​ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు వివరించారు. డ్రగ్స్​ తీసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. అంతకుముందు కొద్ది గంటల క్రితం తన తండ్రి సల్మాన్ తిట్టాడని చెప్పారు. జైలుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నావ్​ అని ప్రశ్నించగా.. తనకు అక్కడ ఉండాలనిపిస్తోందని దర్యాప్తు సమయంలో సల్మాన్​ చెప్పాడని ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు. అయితే సల్మాన్ చెబుతున్నట్టుగా జైలుకు వెళ్లడం కోసమే బెదిరింపు కాల్ చేశాడా లేకా ఇతర కారణాలు ఎవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by:yveerash yveerash
First published: