వీపుపై 173 మంది అమర జవాన్ల పేర్లు పచ్చబొట్టు...

పుల్వామా ఉగ్రదాడి, అంతకు ముందు, ఆ తర్వాత ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన 173 మంది జవాన్ల పేర్లను ఈ విజయ్ హిందుస్తానీ అనే యువకుడు తన వీపు మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.

news18-telugu
Updated: February 14, 2020, 3:50 PM IST
వీపుపై 173 మంది అమర జవాన్ల పేర్లు పచ్చబొట్టు...
వీపుపై 173 మంది అమరజవాన్ల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్న విజయ్ హిందుస్తానీ
  • Share this:
పచ్చబొట్టు అంటే చనిపోయే వరకు ఉండేది. దీంతో చాలా మంది పచ్చబొట్టు పొడిపించుకుంటే తమకు ఇష్టమైన వారి పేర్లు పొడిపించుకుంటారు. అమ్మ, నాన్న, ప్రియురాలు లేదా ప్రియుడు, భర్త లేదా భార్య, ఇలా వారికి ఇష్టమైన వారి పేర్లను పచ్చబొట్టు వేయించుకుంటారు. ఈ మధ్య ట్రెండ్‌ను అనుసరించి కొందరు చిత్రాలను టాటూలు వేయించుకుంటున్నారు. మరికొందరు దేవుళ్ల చిత్రాలను పచ్చబొట్టు పొడిపించుకుంటారు. అయితే, ఢిల్లీకి చెందిన విజయ్ హిందుస్తానీ అనే యువకుడు తన వీపు మీద 173 మంది అమరజవాన్ల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడి, కార్గిల్ యుద్ధం, అనంతనాగ్, ఇతర పోరాటాల్లో అశువులు బాసిన వారి పేర్లను తన వీపు మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. అలాగే, ఛాతీ మీద సీఏఏ, ఎన్ఆర్సీకి అనుకూలంగా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.

వీపు మీద 173 మంది అమరజవాన్ల పేర్లు పచ్చబొట్లు పొడిపించుకున్న విజయ్ హిందుస్తానీ


2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి జరిగింది. సెలవులు ముగించుకుని విధుల్లో హాజరయ్యేందుకు వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ మీద ఉగ్రవాది ఆత్మాహుతిదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద క్యాంప్‌ల మీద భారత ఎయిర్‌ఫోర్స్ మరో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ దాడుల్లో భారీ ఎత్తున ఉగ్రవాదులు చనిపోయారు. ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి.

వీపు మీద 173 మంది అమరజవాన్ల పేర్లు పచ్చబొట్లు పొడిపించుకున్న విజయ్ హిందుస్తానీ
పుల్వామా ఉగ్రదాడి, అంతకు ముందు, ఆ తర్వాత ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి చనిపోయిన జవాన్ల పేర్లను ఈ విజయ్ హిందుస్తానీ అనే యువకుడు తన వీపు మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. వీపు మీద అమరజవాన్ల పేర్లు పొడిపించుకున్న యువకుడు, ఛాతీ మీద we support CAA, NRC అని వేయించాడు. ఆ రకంగా తన దేశభక్తిని చూపించుకుంటున్నానని తెలిపాడు.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు