• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • DELHI LOCKDOWN TOTAL CURFEW IN DELHI TILL NEXT MONDAY DECIDED UPON AT COVID REVIEW MEETING BETWEEN LG ANIL BAIJAL AND CM ARVIND KEJRIWAL NK

Delhi Lockdown: ఢిల్లీలో వారంపాటూ కర్ఫ్యూ... కీలక ప్రకటన చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్

Delhi Lockdown: ఢిల్లీలో వారంపాటూ కర్ఫ్యూ... కీలక ప్రకటన చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో వారంపాటూ కర్ఫ్యూ (అరవింద్ కేజ్రీవాల్ - File Image)

Delhi Lockdown: ఢిల్లీ మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయినట్లే... సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీసుకున్న నిర్ణయమేంటి... దీనిపై ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది?

  • Share this:
    Delhi Lockdown: మహారాష్ట్రలాగానే ఢిల్లీలోనూ కరోనా పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందువల్ల అక్కడి ప్రభుత్వం ఆల్రెడీ వీకెండ్ కర్ఫ్యూ ప్రకటించింది. అయినా సరే ఫలితం కనిపించలేదు. అందువల్ల నేటి రాత్రి నుంచి... వచ్చే సోమవారం (ఏప్రిల్ 26) వరకూ... పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నిర్ణయం తీసుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తో సమావేశం తర్వాత కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ఐతే... ఈ నిర్ణయం కారణంగా... వలస కూలీలు, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూసుకుంటామనీ... కేజ్రీవాల్ తెలిపారు. ఇక్కడ కర్ఫ్యూ అంటే దాదాపు లాక్‌డౌన్ లాంటిదే. ప్రజలు గుంపులుగా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. షాపులు మూసివేస్తారు. ఎక్కడ చూసినా కఠిన ఆంక్షలే ఉంటాయి.

    సడెన్‌గా ఎందుకిలా?
    ఢిల్లీలో కరోనా చాలా తీవ్రంగా ఉంది. రోజూ 25వేల కొత్త కేసులు వస్తున్నాయి. నిన్న కూడా 25వేలు దాటి వచ్చాయి. దాంతో... ఇక లాభం లేదనుకున్న ప్రభుత్వం కర్ఫ్యూ పెట్టేయాలని డిసైడైంది. మరోవైపు ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత బాగా పెరిగింది. దాంతో... లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్... ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్‌కి... లేఖ రాయబోతున్నారు. ఢిల్లీకి ఆక్సిజన్ సిలిండర్లు పంపాలని కోరనున్నారు. అలాగే... కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కూడా... ఆస్పత్రుల్లో మరిన్ని బెడ్లు పెంచమని కోరనున్నారు. పరిస్థితి ఇలా ఉంది కాబట్టే... కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు.


    ఢిల్లీ ప్రభుత్వం గత వారమే వీకెండ్ కర్ఫ్యూ ప్రకటించింది. అంటే... ఏప్రిల్ 16న రాత్రి 10 నుంచి... ఏప్రిల్ 19న ఉదయం 6 గంటల వరకూ ఈ కర్ఫ్యూ అమల్లో ఉంది. అలాగే షాపంగ్ మాల్స్, జిమ్స్, ఆడిటోరియంలను ఏప్రిల్ 30 వరకూ మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏం చేసినా కేసులు తగ్గకపోగా... భారీగా పెరిగాయి. కేసులు పెరుగుతుంటే... ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, గ్యాస్ సిలిండర్లు, రెమ్‌డెసివిర్ (Remdesivir) మందులకు కొరత ఏర్పడుతోంది. అందుకే కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడిన కొన్ని గంటలకే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ఇది కూడా చదవండి: Perfume and Personality: మీకు ఏ సెంట్ ఇష్టం... పెర్ఫ్యూమ్‌ని బట్టీ పర్సనాల్టీ...

    ఢిల్లీలో కొత్తగా 25,462 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటివరకూ ఎప్పుడూ ఇన్ని ఎక్కువ కేసులు ఒకే రోజు రాలేదు. మొత్తం కేసుల సంఖ్య 8,53,460కి చేరింది. నిన్న 161 మంది చనిపోగా... మొత్తం మరణాల సంఖ్య 12,121కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 74,941 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 29.74 శాతం ఉంది. ఇప్పటివరకూ ఇదే అత్యధికం.
    Published by:Krishna Kumar N
    First published: