హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

AAP v/s Delhi LG : ఆప్ కు ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ బిగ్ షాక్

AAP v/s Delhi LG : ఆప్ కు ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ బిగ్ షాక్

వీకే సక్సేనా-కేజ్రీవాల్

వీకే సక్సేనా-కేజ్రీవాల్

AAP v/s Delhi LG : ఆప్(AAP)నేత‌ల‌పై ఢిల్లీ(Delhi) లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా(Lieutenant Governor VK Saxena) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2016 లో వీకే స‌క్సేనా..ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ చైర్మన్ (KVIC)గా ఉన్న సమయంలో రూ. 1400 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, నోట్ల రద్దు సమయంలో రూ.1,400 కోట్లు రద్దు చేసిన నోట్లు మార్పిడి చేయించారని ఆప్‌ నేతలు(AAP Leaders) ఆరోపిస్తున్నారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

AAP v/s Delhi LG : ఆప్(AAP)నేత‌ల‌పై ఢిల్లీ(Delhi) లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా(Lieutenant Governor VK Saxena) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2016 లో వీకే స‌క్సేనా..ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ చైర్మన్ (KVIC)గా ఉన్న సమయంలో రూ. 1400 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, నోట్ల రద్దు సమయంలో రూ.1,400 కోట్లు రద్దు చేసిన నోట్లు మార్పిడి చేయించారని ఆప్‌ నేతలు(AAP Leaders) ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సక్సేనా తన ఇద్దరు అనుచరులపై కూడా ఒత్తిడి తెచ్చారని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ త‌రుణంలో సక్సేనా రాజీనామా చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే తనపై ఆప్ నేతల ఆరోపణలను తిప్పికొట్టిన సక్సేనా ..తనపై అవినీతి వ్యాఖ్యలు చేసిన ఆప్ నేతలపై చట్టపరమైన చర్యలకు రెడీ అయ్యారు. త‌న‌ గౌరవానికి భంగం కలిగించే విధంగా అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు అతిష్‌, సౌరభ్‌ భరద్వాజ్‌లతో అతిషి, దుర్గేష్ పాఠక్, జాస్మిన్ షా తదితరులపై పరువునష్టం దావా వేయనున్నట్లు వీకే స‌క్సేనా స్పష్టం చేశారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది.ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్ వైస్ చైర్మన్ జాస్మిన్ షాపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆప్ నేత‌లు ఊహాజ‌నిత ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని వీకే స‌క్సేనా విమ‌ర్శించారు. ఎదురి వారిపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం, వారు రుజువులు చూపించాల‌ని గ‌ట్టిగా నిల‌బ‌డితే క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం కేజ్రీవాల్‌కు, ఆయ‌న పార్టీ స‌హ‌చ‌రుల‌కు అల‌వాటేన‌ని స‌క్సేనా ఎద్దేవా చేశారు.
Madrassa Demolished : బుల్డోజర్స్ తో మదర్సాని కూల్చివేసిన సర్కార్..టీచర్ అరెస్ట్


మ‌రోవైపు,అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రులు సత్యేందర్ జైన్ , మనీష్ సిసోడియాలను బర్తరఫ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ ఆప్ మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలో వరుసగా రెండో రోజు రాత్రిపూట నిరసన కొనసాగించారు. ఇక,బుధవారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం వద్ద ఆప్‌ నేతలు బైఠాయించారు. ఆప్‌ ఎంపీలు సంజయ్‌ సింగ్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, అతిషి తదితర నేతలు బుధవారం సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన బీజేపీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన పలువురు ఆప్‌ నేతలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో సీబీఐ కార్యాలయం వెలుపల ధర్నాకు కూర్చున్నారు. ఆపరేషన్‌ లోటస్ పేరుతో బీజేపీ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆప్‌ ఆరోపించింది. ఆపరేషన్ లోటస్పై బీజేపీ రూ.6,300 కోట్లపైగా ఖర్చు చేసిందని ఆప్‌ నేతలు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరపాలని పార్టీ డిమాండ్ చేస్తుందని ఆప్ నేత అతిషి ట్వీట్ చేశారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: AAP, Delhi

ఉత్తమ కథలు