ఢిల్లీ లెఫ్టినెంట్ (Delhi) గవర్నర్ అనిల్ బైజాల్ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. కాగా, రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు సమర్పించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అనిల్ బైజాల్ (Anil baijal) 2016, డిసెంబరులో లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రిటైర్డ్ సివిల్ సర్వెంట్ నజీబ్ జంగ్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన గవర్నర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. గత కొన్నేళ్లుగా.. ఢిల్లీలో అధికార ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కి (Delhi Lieutenant Governor) మధ్య తరచుగా అనేక అంశాలలో బేధాభిప్రాయాలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.
లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీల మధ్య పూర్తిగా అధికార పోరు కొనసాగుతుంది. కాగా, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం, AAP నాయకుడు చేసిన చర్యలను Mr బైజల్ అనేక సందర్భాలలో ప్రభుత్వం పంపిన పలు అంశాలను వీటో చేశారు. దీంతో సీఎంకు , గవర్నర్ కు మధ్య ఎప్పుడు ఆధీపత్య పోరు కొనసాగుతుండేది. ఈ క్రమంలో అనిల్ బైజాల్ రాజీనామా చేయడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi