DELHI IMPOSES MORE COVID CURBS NO DINE AT DELHI RESTAURANTS 100 PC WORK FROM HOME FOR PVT OFFICES MKS
lockdown: ఉద్యోగులెవరూ ఆఫీసులకు పోవద్దు.. రెస్టారెంట్లలో తినడం నిషేధం.. covid తాజా ఆంక్షలు
ఢిల్లీలో మరిన్ని కొవిడ్ ఆంక్షలు
రెస్టారెంట్లకు ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకొనే సదుపాయం ఉండగా, ఇప్పుడా సౌకర్యాన్ని తొలగించనున్నారు. రెస్టారెంట్లలో కూర్చొని తినడాన్ని నిషేధించనున్నారు. అన్ని రకాల ప్రైవేటు కార్యాలయాల్లో 100 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోంది. కేంద్ర సర్కారులో టాప్-3 నేత, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కరోనా బారినపడ్డారు. పార్లమెంట్ లో పనిచేస్తోన్న సిబ్బందిలో 400 మందికి కొవిడ్ సోకింది. ఢిల్లీ పోలీస్ విభాగంలోనే 1000 మందిని వైరస్ కాటేసింది. రోజువారీ కేసులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతటా కొవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది కేజ్రీవాల్ సర్కారు. సంపూర్ణ లాక్ డౌన్ విధించబోమంటూనే దాదాపు అదే స్థాయిలో కొత్త ఆంక్షల దిశగా అడుగులు వేస్తోంది. వివరాలివి..
ఢిల్లీలో కరోనా విలయంపై ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ(డీడీఎంఏ) సోమవారం నాడు మరోసారి సమావేశమైంది. ఈ భేటీలో లెఫ్టినెంట్ గవర్నర్ అజిల్ బైజల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కొవిడ్ కట్టడికి మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని డీడీఎంఏ నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ లాక్ డౌన్ విధింపునకు నో చెబుతోన్న డీడీఎంఏ.. ఆంక్షలను మాత్రం మరిత కఠినతరం చేయనుంది.
ఢిల్లీలోని రెస్టారెంట్లకు ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకొనే సదుపాయం ఉండగా, ఇప్పుడా సౌకర్యాన్ని తొలగించనున్నారు. రెస్టారెంట్లలో కూర్చొని తినడాన్ని నిషేధించనున్నారు. ఏది తినాలనుకున్నా టేక్ అవే లేదంటే హోం డెలివరీకి మాత్రమే అనుమతి ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులే హాజరవుతుండగా, ఇకపై అన్ని రకాల ప్రైవేటు కార్యాలయాల్లో 100 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరికాసేపట్లోనే ఈ నిబంధనలకు సంబంధించి అధికారిక ప్రకటన జారీ కానుంది.
ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 22,175 కొత్త కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు అత్యధికంగా 23.53 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. నిన్న ఒక్కరోజే 17 మరణాలు సంభవించాయి. గతేడాది జూన్ 13 తర్వాత మరణాలు ఇంత పెద్ద సంఖ్యలో రావడం ఇదే తొలిసారి. ఏ ఆఫీసులో, ఏ వీధిలో చూసినా కొవిడ్ కేసులే దర్శనమిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో కొవిడ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్లకు విపరీతమైన గిరాకీ కొనసాగుతోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.