DELHI HIGH COURT SLASHES JUHI CHAWLA PETITION ON 5G TECHNOLOGY FINED RS 20 LAKHS FOR MISUING PROCESS OF LAW AK
Juhi Chawla: జూహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. రూ. 20 లక్షల జరిమానా
జూహీ చావ్లా (ఫైల్ ఫోటో)
Juhi Chawla: ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జూహీ అభిమాని సినిమా పాటలు వినిపించటం.. ప్రొసీడింగ్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. 5జీ టెక్నాలజీని అనుమతించవద్దన్న జూవీ చావ్లా విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. టెక్నాలజీ అన్న తరువాత కచ్చితంగా అప్‌గ్రేడ్ కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడానికి ముందే ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌లోని వాదన సహేతుకంగా లేదని.. అనవసరంగా పిటిషన్ వేశారని పేర్కొంది. 5జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని తన పిటిషన్లో పేర్కొన్న జూహీ చావ్లా.. దీని కారణంగా పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధ్రువీకరించేవరకూ 5జీని ఆపాలని కోరింది. ఈ మేరకు జూహీచావ్లాతోపాటు మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
తమ పిటిషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు. అయితే ఈ దీనిపై కేంద్రం కూడా తమ వాదనలు వినిపించింది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే అని తెలిపింది. ఆమె పిటిషన్‌ను కొట్టేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. జూహీ చావ్లా వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జూహీ అభిమాని సినిమా పాటలు వినిపించటం.. ప్రొసీడింగ్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడటంపై సీరియస్ అయింది. జూహీ చావ్లాతోపాటు పలువురికి రూ.20లక్షల జరిమానా విధించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.