Home /News /national /

ఆ వీడియోలు వెంటనే తొలగించండి... ఫేస్‌బుక్, గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ఆ వీడియోలు వెంటనే తొలగించండి... ఫేస్‌బుక్, గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

బాబా రాందేవ్ (File)

బాబా రాందేవ్ (File)

Delhi High Court Order : బాబా రాందేవ్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

యోగా గురు బాబా రాందేవ్‌పై ఆరోపణలు చేసినట్లు ఉన్న వీడియో లింక్‌లను వెంటనే తొలగించాలని ఫేస్‌బుక్ మేనేజ్‌మెంట్‌ను ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. రాందేవ్‌తోపాటూ ఆయన సారధ్యంలో నడుస్తున్న పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌పై రకరకాల ఆరోపణలు, బెదిరింపులూ చేస్తూ ఉన్న వీడియోలను వెంటనే గూగుల్, యూట్యూబ్‌ల నుంచీ తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. పనికిమాలిన వీడియోల వల్ల తన పరువు, ప్రతిష్ట దెబ్బ తింటున్నాయని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలను తొలగించాలని రాందేవ్ ఈమధ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై జనవరి 24న ఢిల్లీ హైకోర్టు ఫేస్‌బుక్, గూగుల్, యూట్యూబ్ సంస్థలకు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.

యోగా గురుపై వచ్చిన వీడియోలను పూర్తిగా చెక్ చేశాం. అవి గూగుల్, యూట్యూబ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించాం. అలాంటి వీడియోలు ఇకపై కనిపించడానికి వీల్లేదు.
జస్టిస్ ప్రతిభా ఎం సింగ్


అభ్యంతరకర వీడియోలను అప్‌లోడ్ చేసేముందు బాధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆ వీడియోలను ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లింకులు చేరకుండా గూగుల్, యూట్యూబ్ మేనేజ్‌మెంట్లు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

ఇది ఒక్క బాబా రాందేవ్ విషయంలోనే కాదు. చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు ఎదుర్కొంటున్న సమస్యే. రాందేవ్ ప్రేరణతో ఇప్పుడు అలాంటి వారంతా తమ వీడియోలను తొలగించాలంటూ కోర్టుల మెట్లెక్కే అవకాశాలున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

బోలెడంత ఆనందం కావాలా... ఈ వెబ్‌సైట్లు మీకోసమే...

వామ్మో... ఇలాంటి వెబ్ సైట్లు కూడా ఉంటాయా? చిత్రం... విచిత్రం

యూట్యూబ్‌ లో సైన్ ఇన్ అవ్వకుండా ఆ వీడియోలు చూడటం ఎలా... ఇలా చెయ్యండి

వాట్సాప్ సీక్రెట్ ట్రిక్... అవతలి వాళ్లకు తెలియకుండా వాళ్ల స్టేటస్ చూడటం ఎలా?
First published:

Tags: Baba Ramdev, Delhi High Court, Facebook, Google, VIRAL NEWS, Youtube

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు