• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • DELHI HIGH COURT ALLOWS TERMINATION OF PREGNANCY BEYOND 24 WEEKS IN A PARTICULAR CASE HERE IS THE DETAILS NK

Termination of Pregnancy: గర్భస్రావంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు...

Termination of Pregnancy: గర్భస్రావంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు...

గర్భస్రావంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు... (ప్రతీకాత్మక చిత్రం)

Termination of Pregnancy: చట్టపరమైన అనుమతి లేకుండా గర్భస్రావం చెయ్యడం నేరం. ఐతే... ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు... గర్భస్రావానికి సంబంధించి సంచలన తీర్పు ఇచ్చింది. అదేంటో తెలుసుకుందాం.

  • Share this:
    మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) (సవరణ) చట్టం 2021ని ఢిల్లీ హైకోర్టు ఈమధ్య ప్రత్యేక కారణంతో పరిశీలించింది. ఈ చట్టంలో తాజా సవరణ ప్రకారం... గర్భం ధరించిన 24 వారాల (6 నెలలు) తర్వాత కూడా... అబార్షన్ చేయించవచ్చు. గర్భంలోని బిడ్డలో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడూ... అబార్షన్ చేయించకపోతే.. తల్లి ప్రాణానికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడూ... ఇలా చెయ్యవచ్చు అని ఆ చట్టం చెబుతోంది. ఈ చట్టాన్ని జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి ధర్మాసనం పరిశీలించింది. 2021లో చట్టంలో చేసిన సవరణలు ఎంతో ప్రాధాన్యంతో ఉన్నవి. సవరణ చట్టం ప్రకారం... పిండంలో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు... ప్రెగ్నెన్సీ 20 వారాలైనా, 24 వారాలైనా... దాంతో సంబంధం లేకుండా గర్భ విచ్చిత్తి (గర్భస్రావం లేదా అబార్షన్) చేయవచ్చని సవరణలతో తెలిపారు అని జడ్జి వివరించారు.

    ఇంతకీ జడ్జి ఈ చట్టాన్ని పరిశీలించడానికి ఓ కేసు కారణం అయ్యింది. ఆ కేసులో తల్లి... 25 వారాల గర్భిణీ. ఆమె కార్డియాక్ (గుండె సంబంధిత) పేషెంట్. ఈ కారణంగా... ఆమెకు పుట్టబోయే బిడ్డకు అసాధారణ రూపం (warfarin embryopathy) ఏర్పడింది. MTP చట్టం ప్రకారం ఏర్పడిన మెడికల్ బోర్డు ఈ కేసుపై తన అభిప్రాయం చెప్పింది. అబార్షన్ చేయిస్తే మంచిదే కానీ... తల్లికి ప్రమాదం అని తెలిపింది. ఆమెకు గుండె సంబంధిత సమస్య ఉంది కాబట్టి... దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

    ఆల్ ఇండియా ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)... పుట్టబోయే బిడ్డ... అసలు బిడ్డలాగానే ఉండదు. పూర్తిగా రకరకాల అసాధారణ పరిస్థితులతో ఉంటుంది. అలాంటి బిడ్డ బతికే అవకాశాలే ఉండవు... అని చెప్పడంతో... అబార్షన్ చేసేయమని మెడికల్ బోర్డు ప్రతిపాదించింది.

    ఇది కూడా చదవండి: Lady Finger Health benefits: ఒంట్లో వేడి తగ్గాలా... బెండకాయ నీటితో ఇలా చెయ్యండి

    దీనిపై పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు... చాలా సందర్భాల్లో... పిండం అసాధారణ స్థితిలో పెరుగుతున్నప్పుడు... 24 వారాల తర్వాత కూడా అబార్షన్లు చేసేందుకు కోర్టులు ఆమోదించిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. మెడికల్ బోర్టు అభిప్రాయంతో ఏకీభవించిన కోర్టు... ప్రెగ్నెన్సీని తొలగించుకునేందుకు అంగీకరించింది. అందువల్ల ఎయిమ్స్ డాక్టర్లు త్వరలోనే ఆమెకు అబార్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఐతే... ఈ ఆపరేషన్ సమయంలో ఆమెకు గుండె సంబంధిత సమస్యల వల్ల ఏదైనా ఇబ్బంది ఎదురైనా... తాము చేసేది ఏమీ లేదన్న అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు ఎయిమ్స్ డాక్టర్లు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు