హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

80 మందికి పైలట్ లను 3 నెలలపాటు సెలవులపై పంపిన స్పైస్ జెట్ సంస్థ.. కారణం ఏంటంటే..

80 మందికి పైలట్ లను 3 నెలలపాటు సెలవులపై పంపిన స్పైస్ జెట్ సంస్థ.. కారణం ఏంటంటే..

స్పైస్‌జెట్ విమానం

స్పైస్‌జెట్ విమానం

Delhi: స్పైస్‌జెట్ విమానయాన సంస్థ తమ పైలట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా మూడు నెలల పాటు సెలవులపై వెళ్లాలని తమ ఉద్యోగులకు సూచించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

సాధారణంగా ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి సెలువులు దొరకడం చాలా కష్టం. కేవలం కొన్ని రోజులు మాత్రమే.. అదికూడా కంపెనీ, అక్కడుంటే బాస్ ను బట్టి డిపెండ్అయి ఉంటుంది. మరీ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొంచెం సెలవుల విషయంలో కాస్త వెసులు బాటు ఉంటుంది. అయితే.. కరోనా మహామ్మారి కారణంగా అనేక కంపెనీలు కాస్ట్ కటింగ్ లో భాగంగా తమ ఉద్యోగులను తీసివేశాయి. మరికొన్ని చోట్ల పనిచేసినకూడా సరిగ్గా శాలరీలు కూడా ఇవ్వలేదు. కరోనా తగ్గాక ఇప్పటికి కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కరోనా తీవ్రత దాదాపు తగ్గింది. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ విమానయాన సంస్థ తీసుకున్న నిర్ణయం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్ గా ఎయిర్ లైన్స్ బోయింగ్, బాంబార్డియర్ ఫ్టీట్ కు చెందిన పైలట్ లు మూడు నెలల పాటు సెలవులపై వెళ్లాలని యాజమాన్యం ఆదేశించింది. అంతే కాకుండా ఈ కాలానికిగాను ఎలాంటి జీతం చెల్లించబడదని కూడా స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు ఒక్కసారిగా షాకింగ్ కు గురయ్యారు. కాగా, ‘విమానయాన సంస్థ ఆర్థిక సంక్షోభం గురించి మాకు తెలుసు.. కానీ ఆకస్మిక నిర్ణయం మనలో చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఒక పైలట్ వాపోయాడు. ప్రస్తుతం కంపెనీలో ఆర్థిక పరిస్థితిపై అనిశ్చితి కూడా ఉంది. కొన్ని రోజులలో ఇది సర్దుకుంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, SpiceJet

ఉత్తమ కథలు