ఒక్కొక్కరికి గరిష్ఠంగా ఐదు కేజీలు మాత్రమే అమ్ముతామని స్పష్టంచేశారు. రాబోయే ఐదు రోజుల్లో కేంద్ర నుంచి లక్ష కేజీల మేర ఉల్లిని కొనబోతున్నామని ఆయన అన్నారు.
మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. ఇంతకుముందు కోస్తేనే కన్నీళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు చూస్తేనే కన్నీళ్లు కారుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లి సామాన్యుడికి అందకుడా కొండెక్కి కూర్చుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.40-50 పలుకుతున్న ఉల్లి.. దేశ రాజధానిలో దాదాపు 70 రూపాయలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో మండుతున్న ఉల్లి ధరల నుంచి ఢిల్లీ వాసులకు ఉపశమనం కల్పించారు ఢిల్లీ సీఎం. రూ.23.90కే కిలో ఉల్లిని అందిస్తున్నారు.
ఢిల్లీలో శనివారం నుంచి కిలో ఉల్లిని రూ.23.90కే అందిస్తామిన సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. 400 రేషన్ షాపులతో పాటు 70 మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లి అమ్మకాలను చేపడతామని చెప్పారు. ఒక్కొక్కరికి గరిష్ఠంగా ఐదు కేజీలు మాత్రమే అమ్ముతామని స్పష్టంచేశారు. రాబోయే ఐదు రోజుల్లో కేంద్ర నుంచి లక్ష కేజీల మేర ఉల్లిని కొనబోతున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో 60-80 పలుకుతున్న ఉల్లిని ఢిల్లీ వాసులకు రూ.24కే అందిస్తున్నామని చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.