సిక్కింను మరో దేశంగా చూపిన ఢిల్లీ యాడ్... తీవ్ర విమర్శలు...

ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఓ పత్రికా ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఆ ప్రకటనలో సిక్కింను మరో దేశంగా చూపించారు.

news18-telugu
Updated: May 23, 2020, 9:53 PM IST
సిక్కింను మరో దేశంగా చూపిన ఢిల్లీ యాడ్... తీవ్ర విమర్శలు...
ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన
  • Share this:
ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఓ పత్రికా ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఆ ప్రకటనలో సిక్కింను మరో దేశంగా చూపించారు. దీనిపై సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత ప్రకటనను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కోరారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు కూడా చేశారు. ‘సిక్కిం అనేది భారత్‌లో అంతర్భాగం. 1975 మే 16న భారత్‌లో 22వ రాష్ట్రంగా ఏర్పడింది. వారం రోజుల క్రితం మేం రాష్ట్ర అవతరణ వేడుకలను కూడా చేసుకున్నాం. ఇలాంటి ప్రకటనలు మేం భారతీయులమే అనే గర్వంగా చెప్పుకుంటున్న సిక్కిం ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తాయి. వెంటనే ఆ ప్రకటనలను ఉపసంహరించాలి.’ అని సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ డిమాండ్ చేశారు. సివిల్ డిఫెన్స్ కార్పొరేషన్‌లో వాలంటీర్లుగా చేరాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఢిల్లీ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటనలో భూటాన్, నేపాల దేశాల సరసన సిక్కిం వాసులా? అంటూ జోడించింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.పొరపాటు వల్ల ఆ ప్రకటన అచ్చు అయిందని, యాడ్‌ను వెంటనే ఉపసంహరిస్తున్నట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ విభాగంలో సీనియర్ అధికారిని సస్పెండ్ చేశారు.First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading