ఢిల్లీలో ఉల్లి లొల్లి... నేటి నుంచీ ప్రభుత్వమే అమ్మకం...

Delhi : ఢిల్లీలో ఉల్లి కేజీ రూ.70 దాటడంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అప్రమత్తమైన సర్కార్... స్వయంగా ఉల్లిని అమ్మేందుకు సిద్ధమైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 28, 2019, 5:35 AM IST
ఢిల్లీలో ఉల్లి లొల్లి... నేటి నుంచీ ప్రభుత్వమే అమ్మకం...
కేజ్రీవాల్ (File)
  • Share this:
ఇవాళ్టి నుంచీ ఢిల్లీ ప్రజలకు ఉల్లి కష్టాలు తీరినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే... ప్రభుత్వమే ఉల్లిపాయల్ని అమ్మేందుకు సిద్ధమైంది. రేషన్ షాపులు, మొబైల్ వ్యాన్లలో ఉల్లిపాయల్ని ఎక్కడబడితే అక్కడ అమ్మేందుకు ఏర్పాట్లు చేసింది. ఒక్కో వ్యక్తికీ ఒకసారి 5 కేజీల ఉల్లిని అమ్ముతామని తెలిపింది. ఈ పని చేస్తున్నది ప్రభుత్వమే కాబట్టి... కేజీ ఉల్లిని రూ.23.90కు అమ్మనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ప్రకటించారు. మొత్తం 400 రేషన్ షాపులు, 70 మొబైల్ వ్యాన్ల ద్వారా చౌకగా ఉల్లిపాయల్ని అందిస్తామని వివరించారు. అంతేకాదు వచ్చే 5 రోజుల్లో కేంద్రం నుంచి లక్ష కేజీల ఉల్లిని సేకరిస్తామన్నారు. తద్వారా... ఈ సమస్యకు చెక్ పెడతామని తెలిపారు.


ప్రస్తుతం ఢిల్లీలో ఉల్లి కేజీ రూ.70 నుంచీ రూ.80 పలుకుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలూ రావడంతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతిని దేశవ్యాప్తంగా ఉల్లికి కొరత ఏర్పడింది. దీన్ని ముందుగా అంచనా వెయ్యలేకపోయిన ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి.
First published: September 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading