హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాలుష్యంపై పోరాటం.. లాక్‌డౌన్ సిద్ధమన్న ఢిల్లీ ప్రభుత్వం..వారికి వర్క్ ఫ్రమ్ హోమ్

కాలుష్యంపై పోరాటం.. లాక్‌డౌన్ సిద్ధమన్న ఢిల్లీ ప్రభుత్వం..వారికి వర్క్ ఫ్రమ్ హోమ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం, ఎన్‌సీఆర్ ప్రాంతాలు, దాని ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతిపాదనను ఒక వారం పాటు పరిగణించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తెలిపారు.

ఢిల్లీలో వాయుకాలుష్యం మళ్లీ ప్రమాదస్థాయికి చేరుకోవడంతో.. దీనిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పాఠశాలలు మూతపడేలా చేసిన కాలుష్యంపై పోరాడేందుకు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారాంతపు లాక్‌డౌన్, వారం పాటు ఇంటి నుండి పని చేయాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. వీటితో పాటు నగరంలో నిర్మాణాలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిలిపివేయాలని సిఫారసు చేసింది. తాము వారాంతపు లాక్‌డౌన్‌ను ప్రతిపాదించామని.. దానికి సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ మంత్రి గోపాల్ రామ్ తెలిపారు. తమ వ్యూహం ఏమిటనే అంశం ఇప్పుడు కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సూచించినట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం, ఎన్‌సీఆర్ ప్రాంతాలు, దాని ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతిపాదనను ఒక వారం పాటు పరిగణించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తెలిపారు. పొలాలను కాల్చడం వల్ల కేవలం 4 శాతం మాత్రమే వాయుకాలుష్యానికి దోహదపడుతుందని కేంద్రం చెప్పడంతో.. పొలంలో మంటల గురించి ఆర్భాటం చేయడానికి ఎటువంటి ఆధారం లేదని కోర్టు పేర్కొంది.

పొరుగున ఉన్న హర్యానా మరియు పంజాబ్‌ల నుండి వచ్చే పొలాల మంటల వల్ల కాలుష్యానికి ఎక్కువ కారణమని చెబుతున్న ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు మందలించింది. ఇలాంటి కుంటి సాకులు చెప్పొద్దని వ్యాఖ్యానించింది. నవంబర్ ప్రారంభం నుండి విషపూరిత పొగమంచుతో పోరాడుతున్న ఢిల్లీ, వారాంతంలో అత్యవసర చర్యలు తీసుకుంది, పాఠశాలలను మూసివేయమని, భవన నిర్మాణ పనులను నాలుగు రోజులు నిలిపివేయాలని ఆదేశించింది.

పొరుగు ప్రాంతాలకు ఇలాంటి ఆంక్షలు వర్తింపజేయకుంటే వాయుకాలుష్యంపై పోరాడేందుకు పూర్తి లాక్‌డౌన్ వంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఢిల్లీలోని గాలి నాణ్యత తరచుగా ప్రపంచంలోని అత్యంత కలుషితమైన రాజధానిగా మార్చేస్తోంది.

రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..

Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి

వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, రవాణా నుండి ఉద్గారాలు, నగరం వెలుపల ఉన్న బొగ్గు ఆధారిత ప్లాంట్లు మరియు ఇతర పరిశ్రమలు, అలాగే బహిరంగ చెత్తను కాల్చడం మరియు ధూళి కారణంగా గాలి నాణ్యత తగ్గింది. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 500 స్కేల్‌పై 343 వద్ద ఉంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే ప్రజలు శ్వాసకోశ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

First published:

Tags: Air Pollution, Delhi, Delhi pollution

ఉత్తమ కథలు