కరోనా కారణంగా చాలామంది ప్రస్తుతం పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అందులోనూ ఢిల్లీ వంటి కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అనేక ఆంక్షలు కూడా అమలులో ఉన్నాయి. మిగతవారిలాగే మద్యం ప్రియులు కూడా ఈ ఆంక్షల కారణంగా ఇబ్బందిపడుతున్నారు. అయితే తమ కొత్త ఎక్సైజ్ పాలసీలోని పలు ఇబ్బందులను గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం.. మందుబాబులకు సులభంగా మద్యం లభించేలా కొన్ని చర్యలు తీసుకుంది. నిజానికి ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి వచ్చినప్పటి నుండి చాలా మంది మద్యం షాపుల ఆచూకీ కనుగొనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఢిల్లీలోని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తన వెబ్సైట్లో మద్యం దుకాణాల కొత్త జాబితా, వాటి చిరునామాలను విడుదల చేసింది.
ఇప్పుడు రాష్ట్రంలో ప్రారంభించిన కొత్త , పాత మద్యం దుకాణాల గురించి కస్టమర్లు ఇంట్లో కూర్చొని సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంలో 543 మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయి. కస్టమర్లు తమ సమీపంలోని మద్యం దుకాణం గురించి తెలుసుకోవడానికి ముందుగా మీరు ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ తర్వాత లైసెన్స్ ఉన్న ట్యాబ్‌ను ఎంచుకోవాలి. దీని తరువాత అక్కడ చూపిన వర్గంలో ప్రైవేట్‌ని ఎంచుకోవాలి. ప్రైవేట్‌ని ఎంచుకున్న వెంటనే మొత్తం 543 మద్యం షాపుల జాబితా, వాటి చిరునామాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఈ వెబ్సైట్ ద్వారా షాపుల్లో లభించే వివిధ రకాల మద్యం ధరలను కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ అదే వెబ్‌సైట్‌కి వెళ్లి ధరల జాబితా ఉన్న ట్యాబ్‌ను ఎంచుకోవాలి. దీని తర్వాత మద్యం వర్గానికి వెళ్లి స్వదేశీ లేదా విదేశీ రకాన్ని ఎంచుకోవడం ద్వారా దాని ధరల గురించి తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఆ హోటళ్లు, రెస్టారెంట్ల గురించి కూడా ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలో గతేడాది నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది. దీని కింద రాజధాని ఢిల్లీలో 849 లైసెన్సులు కేటాయించారు. ఢిల్లీలోని మొత్తం 272 వార్డులు 32 జోన్లుగా విభజించబడ్డాయి. ఒక్కో మండలంలో దాదాపు 27 దుకాణాలు, ఈ విధంగా ఒక్కో వార్డులో 3 నుంచి 4 మద్యం దుకాణాలు నడుస్తాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుతో ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ మూతపడ్డాయి.
UP Elections : ఆమె కూతురు బీజేపీ ఎమ్మెల్యే చేతిలో రేప్‌కు గురైంది..! బాధితురాలి తల్లికి, ఇలా అవకాశం కల్పించింది కాంగ్రేస్ పార్టీ.. !
ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఢిల్లీలో మద్యపాన వయస్సు 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు తగ్గించబడింది. మద్యం షాపుల సైజు పెంచి రోడ్డు పక్కనే కౌంటర్ పెట్టకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది కాకుండా ఇప్పుడు ఢిల్లీలో మద్యం హోమ్ డెలివరీ కూడా అనుమతించబడుతుంది. అయితే కళాశాల, పాఠశాల, కార్యాలయంలోనూ డెలివరీ నిషేధించబడింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.