DELHI GOVERNMENT DECLARED WINTER HOLIDAY TO PRE PRIMARY AND PRIMARY STUDENTS TO JANUARY 15 AMID OF COVID AND POLLUTION ISSUE PRV
Winter holidays: విద్యార్థులకు గుడ్న్యూస్.. జనవరి 15 వరకు శీతాకాల సెలవులు.. ప్రకటించిన ప్రభుత్వం
ఫ్రతీకాత్మక చిత్రం
పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కేసులు, కాలుష్య పరిస్థితిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతోంది. ఈ కారణంగానే పాఠశాలలను 15 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించింది. విద్యార్థులకు శీతాకాల సెలవులు ప్రకటించింది.
ఢిల్లీ (Delhi)లో గత కొంతకాలంగా విద్యార్థులు (Students) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు కరోనా మరోవైపు గాలి కాలుష్యం సమస్యలతో అతలాకుతలం అవుతున్నారు. కరోనా నేపథ్యంలో (Amid of corona) చాలా నెలలుగా పాఠశాలలు (schools), కాలేజీలు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలె భౌతిక తరగతులు (Offline classes) ప్రారంభం కాగా, మళ్లీ వాతావరణ కాలుష్యం కారణంగా తరగతులను కొనసాగించలేక పోయారు. ఇతర రాష్ట్రాల్లో భౌతిక తరగతులు జరుగుతుండటం ఢిల్లీలోని విద్యార్థులకు (for students) కొద్దిగా నష్టం చేకూర్చేదే. అయితే ఇటీవలె కాలుష్యం తగ్గడంతో తరగతులు మళ్లీ ప్రారంభించింది ఢిల్లీ ప్రభుత్వం. కాగా, ఉత్తర భారతదేశంలో చలి (cold) మామాలూగా ఉండదు. ఇక ఢిల్లీలో అసలే కాలుష్యం (Pollution).. దీంతో చలి గాలులు విపరీతంగా వీస్తుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఢిల్లీ ప్రభుత్వం (Government of Delhi) విద్యార్థులకు ఊరటనిచ్చింది. చిన్నారులకు శీతాకాల సెలవులను (Winter Holidays) ప్రకటించింది.
జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలకు (For Delhi Government Schools) శీతాకాల సెలవులు ఉంటాయి. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు (For pre-primary and primary school students) ఈ సెలవులు వర్తిస్తాయి. ఈ కాలంలో ఆన్లైన్ విద్య (No Online classes) కూడా ఉండదని స్పష్టం చేసింది. శీతాకాలం దృష్ట్యా ప్రభుత్వం సెలవులు ప్రకటించాలని నిర్ణయించింది. పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కేసులు (Corona cases), కాలుష్య పరిస్థితిపై ఢిల్లీ ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతోంది. అదే సమయంలో ఢిల్లీలో చలి కూడా విపరీతంగా ఉంది. ఉష్ణోగ్రతలు (temperatures) తీవ్రంగా పడిపోయాయి.
ఆదివారం ఢిల్లీ-ఎన్సీఆర్లో చినుకులు కురవడంతో శీతాకాలం మరింత పెరిగింది. వీటన్నింటి దృష్ట్యా 15 రోజులు పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెలవుల కాలంలో ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహించరు. డిసెంబరు 17న 5వ తరగతి వరకు పాఠశాలలను ఓపెన్ చేయడానికి ఆమోదం తెలిపింది.
కాగా, ఇదే నెలలో ఢిల్లీలో కాలుష్యం కారణంగా విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయిందని వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం కొన్నిరోజులు విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రతపై కూడా ఆగ్రహం వ్యక్తంచేసింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తుందని కోర్టు కేంద్రానికి తెలిపింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కాలుష్యం ఎందుకు తగ్గడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.