హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

SEX Word: ఆమె స్కూటీపై వెళ్లలేక.. బయట తిరగలేకపోతోంది.. ‘సెక్స్’ ఇంత పని చేస్తుందని ఊహించి ఉండదు..

SEX Word: ఆమె స్కూటీపై వెళ్లలేక.. బయట తిరగలేకపోతోంది.. ‘సెక్స్’ ఇంత పని చేస్తుందని ఊహించి ఉండదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SEX Word: ఢిల్లీలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రీతీ అనే ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్న విద్యార్థినికి వింత అనుభవం ఎదురైంది. ఆమె జనక్‌పురి నుండి నోయిడా వరకు ఢిల్లీ మెట్రో ద్వారా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణానికి ఆమెకు సమయం ఎక్కువ పడుతుంది.

ఇంకా చదవండి ...

ఢిల్లీలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రీతీ అనే ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్న విద్యార్థినికి వింత అనుభవం ఎదురైంది. ఆమె జనక్‌పురి నుండి నోయిడా వరకు ఢిల్లీ మెట్రో ద్వారా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణానికి ఆమెకు సమయం ఎక్కువ పడుతుంది. అయితే తనకు స్కూటీ కావాలని ఆమె తన తల్లిదండ్రులను కోరింది. చివరకు నవంబర్ 3న తన పుట్టినరోజు సందర్భంగా స్కూటీని బహుమతిగా అందుకుంది. ఇలా కొత్త స్కూటీ కొనుక్కొని బయట తిరుగుతున్న ఈమెకు ఆ స్కూటీతోనే సమస్య ఎదురవుతుందని అనుకోలేదు. నెంబర్ ప్లేట్ మీద SEX అని ఉండడంతో ఆ అమ్మాయి కంగుతిన్నది.

Married Women: ముగ్గురు పిల్లల తల్లిపై అలా ఎలా చేయాలనిపించిందయ్యా నీకు.. చివరకు ఏమైందో చూడు..


మొదట ఎవరూ గుర్తు పట్టలేరు.. ఏం కాదులే అనుకుంది. కానీ ఆమె స్కూటీ కొన్న రోజు నుంచే స్నేహితులు హేలన చేయడం ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. స్కూటర్ యజమాని ప్రీతి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఢిల్లీ నివాసి. ఆమె పుట్టినరోజు కానుకగా తన తల్లిదండ్రులకు స్కూటీని బహుమతిగా అడిగింది. ఆమె తల్లిదండ్రులు కూడా పుట్టినరోజు కానుకగా ఆమెకు స్కూటీని కొనిచ్చారు. అయితే ఈ బహుమతి ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించింది..కానీ ఆ స్కూటర్ కు రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత అస్సలు కష్టాలు మొదలయ్యాయి.

Telangana Minister: ఓటమి భయంతోనే ఇలా చేశారు.. కేంద్రంపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..


ఎందుకంటే.. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లి ఫార్మాల్టీస్ మొత్తం పూర్తి చేసుకొని ఆమె ఇంటికి వచ్చింది. ఓ రోజు ఆ స్కూటీని నంబర్ ను కేటాయించారు రోడ్ ట్రాన్స్ పోర్టు అధికారులు. ఇక్కడే ఆమెకు పెద్ద కష్టం వచ్చి పడింది. ఆమెకు లభించిన నంబర్ ప్లేట్‌లో సంఖ్యల మధ్య SEX అనే అక్షరాలు ఉన్నాయి. నంబర్ ప్లేట్‌లోని అక్షరాలు తనను, తన కుటుంబాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. సాధారణంగా బైక్‌ నెంబర్ ప్లేట్‌పై నెంబర్‌తో పాటు ఆ వాహనం ఏ రాష్ట్రానికి, ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి చెందినదో సూచిస్తూ ఆంగ్లంలో అక్షరాలు కూడా ఉంటాయి. ఆ యువతికి వచ్చిన నంబర్ ప్లేట్‌‌పై `DL3 SEX` అనే అక్షరాలు ఉన్నాయి. అవే ఆమెకు ఊహించని చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇక స్కూటీ మీద ఆ పదాలను చూసి మొదట్లో, స్నేహితులు దీనిని ఎగతాళి చేయడం ప్రారంభించారు.

Comedian Raghu Karumanchi: మద్యం అమ్ముతున్న కమెడియన్ రఘు.. కారణం ఏంటో తెలుసా..


తర్వాత ఆ పదాలను చూసి ఇరుగుపొరుగు వారు ఆ యువతిని ఏడిపించడం మొదలు పెట్టారు. కొందరు దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఇది వైరల్ గా మారింది. దీంతో ఆమెకు అవమానం ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆ దెబ్బకు ఆమె ఆ స్కూటీపైనే తిరగడం మానేసింది. ఇదే విషయమై ఆర్‌టీఓ కార్యాలయాన్ని ఆమె తండ్రి సందర్శించాడు. తమకు కేటాయించిన నంబర్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. నంబర్ ను మార్చండి అని అడిగాడు. అయితే ఇలా ఢిల్లీలో `SEX` సిరీస్‌ నుంచి మొత్తం పదివేల వాహనాలకు నంబర్‌ ప్లేట్‌ కేటాయించామని, అది పెద్ద విషయం కాదని ఓ అధికారి తెలిపారు.

ప్రేమ కావాలా? మటన్ కావాలా? ఓ ‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’... ఈ సమస్యకు పరిష్కారం మీకు తెలుసా?ఇప్పుడు ఈ నంబర్ ప్లేట్ మార్చడం కుదరదని అతడు చెప్పేశాడు. ఢిల్లీలో వాహనాలకు కేటాయించే నెంబ‌ర్ల‌న్నీ DLతో మొదలవుతాయి. ఆ తర్వాత సంబంధిత జిల్లాను బట్టి కేటాయించే నెంబర్, వాహనాన్ని బట్టి ఇచ్చే సింగిల్ లెటర్, రెండక్షరాల లేటెస్ట్ సిరీస్, నాలుగంకెలు.. ఇవన్నీ వరుస క్రమంలో ఉంటాయి. ఉదాహరణకు DL 2 C AD 1234. ఇక్కడ 2 అనే నెంబర్ తూర్పు జిల్లాను సూచిస్తుంది. C అంటే కారు. AD అనేది నంబర్ సిరీస్.

Formula For Weight Loss : అల్లం ఉపయోగించి బరువు తగ్గొచ్చు.. అదెలా అంటే.. ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి..


అదే టూవీలర్స్ అయితే C లెటర్ స్థానంలో S అనే లెటర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే సిరీస్‌లో EX అనే లెటర్స్‌ ఉండటం ఇప్పుడు ఢిల్లీలో చాలామంది ద్విచక్రవాహనదారులకు ఇబ్బందిగా మారింది. ‘S EX’ అనే నెంబర్ సిరీస్ ఉన్న వాహనదారులు.. ఆ సిరీస్‌తో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మరోవైపు ఆర్టీవో అధికారులు దాన్ని మార్చడం కుదరద‌ని చెప్తుండటంతో ఆ సిరీస్ కలిగిన వాహనదారులకు తిప్పలు తప్పేలా లేవు.

First published:

Tags: Crime news, Criminal women, Delhi, Delhi news, Fancy numbers, Rto

ఉత్తమ కథలు