విమాన సర్వీసులకు పబూక్ తుఫాన్... ఫాగ్ దెబ్బ

విమాన సర్వీసులకు పబూక్ తుఫాన్... ఫాగ్ దెబ్బ

ప్రతీకాత్మక చిత్రం

విమానాల రద్దు లేదా మార్పు కోసం విధిస్తున్న రుసుమును కూడా విమానసంస్థలు రద్దు చేశాయి.

 • Share this:
  ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు తీవ్రంగా కురుస్తుండటంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల్ని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. 13 రైళ్లు కూడా తీవ్ర పొగమంచు కారణంగా ఢిల్లీలో ఆలస్యంగా నడుస్తున్నాయి.

  ఇండిగో విమానం


  మరోవైపు పబూక్ సైక్లోన్ దెబ్బకు అండమాన్‌ నికోబర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ కురుస్తున్న వర్షాలతో బెంగుళూరు అండమాన్ మధ్య నడిచే విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతోయవిస్తారా, ఇండిగోతో పాటు ఇతర విమాన సంస్థలు తమ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. విమానాల ఆలస్యం పట్ల అప్రమత్తం చేసి సమాచారాన్ని అందిస్తున్నాయి. ప్రయాణానికి ముందు ఒకసారి డిపార్చర్, ఎరైవల్ టైమింగ్స్‌ని చెక్ చేసుకోవాలని సూచిస్తున్నాయి.

  పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాల ఆలస్యం


  ఎయిర్లైన్స్ కూడా అదనపు రుసుము లేకుండా విమానాలు మర్చుతున్నామని ప్రయాణీకులకు తెలిపింది. పోర్ట్ బ్లెయిర్ కు విమానాల రద్దు లేదా మార్పు కోసం విధిస్తున్న రుసుమును కూడా విమానసంస్థలు రద్దు చేశాయి. మరోవైపు తీవ్రమైన పొగమంచు కారణంగా కర్ణాటక రాజధాని నుండి చెన్నైకి రెండు విమానాలు మళ్ళించారు అధికారులు.   
  First published:

  అగ్ర కథనాలు