హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Fire Accident: అగ్నిప్రమాద ఘటనలో 27కి పెరిగిన మృతుల సంఖ్య.. ఈ ఘోరం ఎలా జరిగింది?

Delhi Fire Accident: అగ్నిప్రమాద ఘటనలో 27కి పెరిగిన మృతుల సంఖ్య.. ఈ ఘోరం ఎలా జరిగింది?

ఘటనా స్థలంలో దృశ్యాలు

ఘటనా స్థలంలో దృశ్యాలు

Delhi Fire Accident: భవనం మొదటి అంతస్తులో ఉన్న సీసీ టీవీ కెమెరా, రూటర్ తయారీ కంపెనీ కార్యాలయం నుంచి మొదట మంటలు చెలరేగాయని డీసీపీ సమీర్ శర్మ తెలిపారు. ఆ కంపెనీ యజమానిని కస్టడీలోకి తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాద (Delhi Fire Mishap) ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 27 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. వీరంతా సజీవ దహనమైనట్లు పేర్కొన్నారు. మరో 40 మంది గాయపడ్డారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. అర్ధరాత్రి తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ రెస్క్యూ సిబ్బంది పలు కార్యాలయాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తీవ్రమైన వేడి ఉండడంతో వారు లోపలికి వెళ్లేకపోయారు. ఇవాళ వేడి తగ్గిన తర్వాత మరోసారి లోపలికి వెళ్లనున్నారు. గదులన్నీ పరిశీలించి.. ఇంకా ఎవరైనా ఉన్నారా? అని చూడనున్నారు. ఆ భవనంలో ఇంకా కొందరు చిక్కుకొని ఉన్నారని స్థానికులు చెప్పారు. మరి వారంతా ఏమయ్యారన్నది తెలియాల్సి ఉంది.

కాగా, ఢిల్లీలోని ముంద్కా మెట్రో స్టేషన్‌  (Mundka Metro station)సమీపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ముంద్కా మెట్రో స్టేషన్ 544వ నంబరు స్తంభం వద్ద ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో పెద్ద ఎత్తున మంటలు  (Delhi Fure Accident) ఎగిసిపడ్డాయి. సాయంత్రం 04.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 24 ఫైరింజన్లను రంగంలోకి దించారు. ఓ వైపు మంటలు అదుపు చేస్తూనే.. మరోవైపు భవనంలోని కార్యాలయాలలో చిక్కుకున్న పలువురిని కాపాడారు. దాదాపు 70 మందిని కాపాడి భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు. మరికొందరు మాత్రం మంటల్లో కాలిపోయి మరణించారు. వారి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు.

Judgement: భార్యాభర్తలు కోర్టు బయట రాజీపడితే.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

భవనం మొదటి అంతస్తులో ఉన్న సీసీ టీవీ కెమెరా, రూటర్ తయారీ కంపెనీ కార్యాలయం నుంచి మొదట మంటలు చెలరేగాయని డీసీపీ సమీర్ శర్మ తెలిపారు. ఆ కంపెనీ యజమానిని కస్టడీలోకి తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోమంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేశారు.

First published:

Tags: Delhi, Fire Accident, New Delhi

ఉత్తమ కథలు